Anam Ramanarayanareddy: న్యాయవాది సుధాకర్‌రెడ్డిపై విరుచుకుపడ్డ ఆనం రామనారాయణ రెడ్డి

ABN , First Publish Date - 2023-09-16T10:51:01+05:30 IST

న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థలు సక్రమంగా పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అడ్వకెట్ జనరల్ చట్టాలు, న్యాయ శాస్త్రాలకు విలువిచ్చే మనిషి కాదన్నారు.

Anam Ramanarayanareddy: న్యాయవాది సుధాకర్‌రెడ్డిపై విరుచుకుపడ్డ ఆనం రామనారాయణ రెడ్డి

నెల్లూరు: న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థలు సక్రమంగా పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (MLA Anam Ramanarayana reddy) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అడ్వకెట్ జనరల్ చట్టాలు, న్యాయ శాస్త్రాలకు విలువిచ్చే మనిషి కాదన్నారు. జగన్మోహన్ రెడ్ది (CM Jagan) ద్వారా పునర్జన్మ పొందాను అని సుధాకర్ రెడ్ది చెప్పడం హాస్యాస్పదమన్నారు. సుధాకర్ రెడ్డి ప్రభుత్వ న్యాయవాదిగా తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటున్నారని విమర్శించారు. అదనపు అడ్వకెట్ జనరల్ అయినా.. తన సేవలు జగన్మోహన్ రెడ్డీకే అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం దగ్గర వసతులు, జీతబత్యాలు పొందుతూ జగన్మోహన్ రెడ్ది సేవకుడిని అని చెప్పడం హేయమన్నారు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ తరువాత ఎనిమిది మందికి వ్యక్తిగత సెక్యూరిటీ పెంచుకున్నారని తెలిపారు. సుధాకర్ అదనపు అడ్వకెట్ జనరల్ జనరల్ కంటే.. వైసిపీ కార్యకర్త అని చెప్పుకోవచ్చని వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తుల వలన న్యాయం చట్టం మీద నమ్మకం సన్నగిళ్ళుతుందని ఆయన అన్నారు.


ఇది రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరమన్నారు. ఇలాంటి ప్రకటన చేసిన ఏ.ఏ.జె సుధాకర్‌పై అత్యున్నత న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ రెస్పాండ్ కావాలని కోరారు. ఇలాంటి వారున్న ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత భద్రతపై అనుమానం రాక మానదన్నారు. ఒక వ్యక్తికి సేవ చేసుకుంటాను అనే వ్యక్తి ప్రజలకు ఎలా సేవ చేయగలరని ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు భద్రత లేదన్నారు. జైళ్ల శాఖ అధికారి ప్రభుత్వంలో మంత్రికి దగ్గర వ్యక్తి కావడం చంద్రబాబు భద్రతపై మరింత అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రతిపక్ష నేత అరెస్ట్, రిమాండ్‌పై ముఖ్యమంత్రి ఇప్పటికి నోరు మేదపకపోవడం దారుణమని మండిపడ్డారు. చంద్రబాబు విడుదలపై విప్లవం జరుగుతున్నా.. ఈ ప్రభుత్వంలో చలనం లేదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-09-16T10:51:36+05:30 IST