AP NEWS: నెల్లూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. కారణమేంటంటే..?
ABN , Publish Date - Dec 30 , 2023 | 10:04 PM
తమ డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్మికులు ఏపీ వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. నెల్లూరులోని ఐసీడీఎస్ పీడీ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మెలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీ మహిళలపై పోలీసులు అరాచకం సృష్టించారు.
నెల్లూరు: తమ డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్మికులు ఏపీ వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. నెల్లూరులోని ఐసీడీఎస్ పీడీ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మెలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీ మహిళలపై పోలీసులు అరాచకం సృష్టించారు. సీఐటీయూ నేతలని అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీసు వాహనాలకి అంగన్ వాడీ మహిళలు అడ్డుపడ్డారు. మహిళలపై పోలీసులు దాడి చేశారు. పలువురికి గాయాలు అయ్యాయి. ఘోరంగా చీరలు, జుత్తు లాగిపారేస్తూ పోలీసులు అరాచకం సృష్టించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వచ్చేంత వరకు కదిలేది లేదని మహిళలు. సీఎం డౌన్... సీఎం డౌన్... అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి కాకాణి ఇంటికి మహిళలు బయలుదేరగా పోలీసులు అంగన్‌వాడీలను అడ్డుకున్నారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటి వద్ద...
ప్రకాశం : మార్కాపురంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి ఇంటి ఎదుట 5 గంటల పాటు అంగన్వాడీల మహా ధర్నా కొనసాగింది. మంత్రి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇంటి గేట్లు దూకి అంగన్వాడీ సిబ్బంది లోపలికి చొచ్చుకుపోయారు. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో అంగన్వాడీలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల జోక్యంతో మంత్రి వ్యక్తిగత సహాయకుడికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేసి అంగన్వాడీ సిబ్బంది వెనుదిరిగారు.