Nara Rohith : జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-03-25T11:43:55+05:30 IST

యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సైతం నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

Nara Rohith : జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

శ్రీ సత్యసాయి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్రకు హీరో నారా రోహిత్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ డిఫెన్స్‌లో పడిందని.. అందుకే తెలుగుదేశం పార్టీపై బురదజల్లుతున్నారని విమర్శించారు. యువగళం పాదయాత్ర మున్ముందు ప్రభంజనం రేపుతుందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సైతం నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వస్తారని వ్యాఖ్యానించారు.

కాగా.. టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) 50వ రోజుకు చేరుకుంది. పుట్టపర్తి నియోజకవర్గంలో యువనేత 50వ రోజు యువగళం పాదయాత్ర కొనసాగనుంది. మూడు రోజుల విరామం తరువాత శనివారం ఉదయం పుట్టపర్తి నియోజకవర్గం ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. అంతకు ముందు ఒనుకువారిపల్లి విడిది కేంద్రంలో సెల్పీవిత్ లోకేష్ (Selfy with Lokesh) కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. ప్రతీ రోజూ సుమారుగా వెయ్యి మందికి లోకేష్ సెల్ఫీ ఇస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి వచ్చిన ప్రజలను ఉదయమే కలిసి ఫోటోలు దిగుతున్నారు. లోకేష్ ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే లోకేస్ ఇప్పటి వరకు 625 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

Updated Date - 2023-03-25T15:39:46+05:30 IST