Share News

Nandamuri Balakrishna: 2024లో అందరి కలలు సాకారం కావాలి

ABN , Publish Date - Dec 31 , 2023 | 06:29 PM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సినీనటులు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు ప్రజలందరికీ నూతన ఏడాది సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

Nandamuri Balakrishna: 2024లో అందరి కలలు సాకారం కావాలి

అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సినీనటులు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు ప్రజలందరికీ నూతన ఏడాది సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి.. నూతన సంవత్సరానికి హృదయపూర్వక స్వాగతం పలుకుదామని తెలిపారు. 2024లో అందరి కలలు సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 10:25 PM