Anam Ramnarayana reddy: సజ్జలపై ఎమ్మెల్యే ఆనం ఫైర్

ABN , First Publish Date - 2023-09-09T15:01:47+05:30 IST

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Anam Ramnarayana reddy: సజ్జలపై ఎమ్మెల్యే ఆనం ఫైర్

హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణపై (Sajjala Ramakrishna) ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (MLA Anam Ramnarayana Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. సలహాదారులు, మంత్రుల మాటలు వినే పరిస్థితుల్లో ఏపీ ప్రజలు లేరన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. మళ్ళీ గెలవనని సీఎం‌ జగన్‌కు అర్థమైందని.. అందుకే చంద్రబాబును (TDP Chief Chandrababu naidu) అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. రూ.43 కోట్ల‌ ప్రజాధనంతో సీఎం జగన్ సొంత పర్యటనకు వెళ్ళారన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ యాత్రలతో జగన్‌లో వణుకు మెదలైందని ఆనం రాంనారాయణరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-09T15:01:47+05:30 IST