Share News

MLA Chennakesava Reddy: వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే చెన్నకేశవ‌రెడ్డి అసహనం

ABN , Publish Date - Dec 18 , 2023 | 10:44 PM

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ( MLA Chennakesava Reddy ) వైసీపీ ప్రభుత్వం ( YCP GOVT ) పై అసహనం వ్యక్తం చేశారు.

 MLA Chennakesava Reddy:  వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే చెన్నకేశవ‌రెడ్డి అసహనం

కర్నూలు : ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ( MLA Chennakesava Reddy ) వైసీపీ ప్రభుత్వం ( YCP GOVT ) పై అసహనం వ్యక్తం చేశారు. సోమవారం నాడు ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘నేను జగన్‌కు మద్దతు గా నిలిచాను. నేను పై నుంచి ఊడిపడిన నాయకుడిని కాదు.. కింద నుంచి, ప్రజల నుంచి వచ్చిన నాయకుడిని. జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యాక నాయకులు అయ్యారు. మరి కొంతమంది గాడ్ ఫాదర్లను పెట్టుకొని ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. నా తనయుడు కూడా ప్రజల నుంచి వస్తున్నాడు. ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీని చేద్దామనుకున్న బీసీ రిజర్వేషన్ కావడంతో ఆగిపోయాను.నా కొడుకు ప్రజల మనిషి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రజలే గెలిపిస్తారు’’ అని ఎమ్మెల్యే చెన్నకేశవ‌రెడ్డి తెలిపారు.

Updated Date - Dec 18 , 2023 | 10:44 PM