Chandrababu Arrest : చంద్రబాబును ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లే యత్నం.. హెలికాఫ్టర్ సిద్ధం..

ABN , First Publish Date - 2023-09-09T07:47:10+05:30 IST

నంద్యాలలో అర్ధరాత్రి నుంచి హైడ్రామా చోటు చేసుకుంది. నేటి తెల్లవారుజామున టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు అరెస్ట్ వార్తలతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా కలకలం రేగింది.

Chandrababu Arrest : చంద్రబాబును ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లే యత్నం.. హెలికాఫ్టర్ సిద్ధం..

నంద్యాల : నంద్యాలలో అర్ధరాత్రి నుంచి హైడ్రామా చోటు చేసుకుంది. నేటి తెల్లవారుజామున టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు అరెస్ట్ వార్తలతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా కలకలం రేగింది. చంద్రబాబును అరెస్ట్ చేసి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు తీసుకువెళ్ళాలని పోలీసులు యత్నిస్తున్నారు. అక్కడ హెలికాప్టర్‌ను పోలీసులు సిద్ధంగా ఉంచారు. అక్కడి నుంచి విజయవాడకి తరలించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఫైళ్ళను పోలీసులు నంద్యాల తీసుకువెళ్లారు. ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొంతమందికి కోర్టు ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. ఇదే కేసులో ఒక ఆడిటర్‌ను సీఐడీ అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో ఏదైనా స్టేట్‌మెంట్ ఇపపించారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-09-09T07:47:10+05:30 IST