Bhuma Akhilapriya: స్టిక్కర్లను ఇళ్లకు కాదు..వాళ్ల ముఖాలకు బాగుంటుంది..

ABN , First Publish Date - 2023-04-14T13:03:44+05:30 IST

కర్నూలు: వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) స్టిక్కర్లను ఇళ్లకు కాకుండా.. వాళ్ల ముఖాలకు అతికించుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Bhuma Akhilapriya) అన్నారు.

Bhuma Akhilapriya: స్టిక్కర్లను ఇళ్లకు కాదు..వాళ్ల ముఖాలకు బాగుంటుంది..

కర్నూలు: వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) స్టిక్కర్లను ఇళ్లకు కాకుండా.. వాళ్ల ముఖాలకు అతికించుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Bhuma Akhilapriya) అన్నారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై ప్రజల తిరుగుబాటు మొదలైందని అన్నారు. నారా లోకేష్ (Nara Lokesh) యువకులకు ప్రత్యేక మేనిఫేస్టో (Special Manifesto) తయారు చేశారని పేర్కొన్నారు.

కర్నూలు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ప్రజలు అడుగడుగున లోకేష్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.. వైసీపీ ఎమ్మెల్యేలను విమర్శిస్తే లోకేష్ ఇంటిముందు కూర్చుంటామని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై అఖిలప్రియ స్పందించారు. ఎమ్మెల్యేలు ఇంటింటికి వచ్చి బలవంతంగా స్టిక్కర్లు అతికిస్తున్నారని, తిరిగి వాళ్లు దాడి చేస్తే పరిస్థితి ఏంటన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు పడుతున్నది గమనించకుండా.. ఎమ్మెల్యేలు స్టిక్కర్లు తీసుకువచ్చి వాళ్లకు ఇష్టమున్నా లేకున్నా గోడలకు అతికిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాగుపడినవాళ్లు ఎవరైనా ఉన్నారంటే.. అది వైసీపీ నాయకులు, వాళ్ల కార్యకర్తలేనని భూమా అఖిలప్రియ అన్నారు.

జగత్ విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర చాలా బాగా సాగుతోందని, ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారని అన్నారు. లోకేష్ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. యువతను చైతన్యవంతం చేయడమేనని, చరిత్రలో ఎక్కడాలేని విధంగా యువత కోసం మేనిఫెస్టో సిద్ధం చేశారన్నారు. ప్రజలు తమ తమ సమస్యలను లోకేష్‌కు చెప్పుకుంటున్నారన్నారు. ప్రజల్లో వ్యతిరేకతకాదు.. తిరుగుబాటు మొదలైందన్నారు. ఎమ్మెల్యే బ్యాగులతో స్టిక్కర్లు తీసుకుని ఇంటింటికి అతికించడం కాదని, వాళ్లు ఏం చేశారో చెప్పాలన్నారు.

Updated Date - 2023-04-14T14:40:20+05:30 IST