BC Janardhan Reddy : జగన్‌రెడ్డి జీవితమంతా బాహుబలిలో భల్లాలదేవ లాంటిది
ABN , First Publish Date - 2023-11-29T19:18:41+05:30 IST
సీఎం జగన్‌రెడ్డి ( CM JAGAN ) జీవితమంతా బాహుబలిలో భల్లాలదేవ లాంటిదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ( BC Janardhan Reddy ) అన్నారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు 401 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించిదని బీసీ జనార్దన్‌రెడ్డి చెప్పారు.
నంద్యాల: సీఎం జగన్‌రెడ్డి ( CM JAGAN ) జీవితమంతా బాహుబలిలో భల్లాలదేవ లాంటిదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ( BC Janardhan Reddy ) అన్నారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు 401 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించిదని చెప్పారు. జిల్లాలో 80 శాతం పనులు పూర్తి చేసి పదివేల క్యూసెక్కులు నీటిని విడుదల చేసిన ఘనత చంద్రబాబుదని తెలిపారు. జగన్ ప్రభుత్వం 108 కోట్లతో రివర్స్ టెండరింగ్ వేయించి నాలుగున్నరేళ్లుగా 20 శాతం పనులు కూడా పూర్తి చేయలేదని ఎద్దేవ చేశారు. ఇంకా 30 కోట్ల పనులు మిగిలి ఉండగానే సీఎం జగన్‌రెడ్డి కొబ్బరికాయ కొడతా ప్రారంభిస్తానని అనడానికి సిగ్గుపడాలని దెప్పిపొడిశారు. గాలేరు నగరి ప్రాజెక్టులో 8 టీఎంసీ లు ఉన్నప్పటికీ SRBC ద్వారా కంటిన్యూగా కనీసం 1000 క్యూసెక్కుల నీటిని కూడా విడుదల చేయలేకపోయారని చెప్పారు. నీటిని విడుదల చేయకపోవడంతో బనగానపల్లె నియోజకవర్గంలో ఒక లక్ష ఎకరాల పైన పంట నష్టం జరుగుతుందని బీసీ జనార్దన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.