Buggana rajendranath: అప్పులపై మాట్లాడేవారికి కేంద్ర మంత్రే సమాధానం ఇచ్చారు

ABN , First Publish Date - 2023-08-03T17:08:37+05:30 IST

రాష్ట్రంలో అప్పులపై చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. సొంతంగా ప్రకటించుకున్న ఆర్థికవేత్తలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు ఇలా అప్పులపై మాట్లాడేస్తున్నారు. పార్లమెంట్‌లో వీరంతా వేస్తున్న ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చేశారు.

Buggana rajendranath: అప్పులపై మాట్లాడేవారికి కేంద్ర మంత్రే సమాధానం ఇచ్చారు

అమరావతి: ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష నేతలంతా పొరుగు రాష్ట్రంలోనే ఉంటున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (Buggana rajendranath Reddy) విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో అప్పులపై చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. సొంతంగా ప్రకటించుకున్న ఆర్థికవేత్తలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు ఇలా అప్పులపై మాట్లాడేస్తున్నారు. పార్లమెంట్‌లో వీరంతా వేస్తున్న ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చేశారు. మొత్తంగా రూ.4.41 లక్షల కోట్లు ఉందని చెప్పారు. మరి అందరూ ఆరోపించిన రూ.10 లక్షల కోట్లు ఏమైంది?, ఈ నాలుగేళ్లుగానే రాష్ట్ర అప్పులపై సోకాల్డ్ ఆర్థికవేత్తలు మాట్లాడారు. ఏపీకి కేంద్రం సహకారం అందకూడదనే వీరంతా ఫిర్యాదులు చేశారు. కేంద్ర మంత్రులు, ఆర్బీఐ చెబితే విశ్వసించకుండా ఎవరో సంబంధం లేని వ్యక్తులు అప్పులు అని చెబితే వింటారా?, 2019 నుంచి ప్రతిపక్షాలకు మేం అంటే గిట్టకే అప్పులపై దుష్ప్రచారం చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు వర్తించే నిబంధనలు ఏపీకి వర్తిస్తున్నాయి. ఏపీకి శ్రీలంకకు పోలిక పెట్టారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu), అయన కుమారుడు సింహాలతో పోల్చుకుంటూ జంతువులు అవుతున్నారు. అప్పుల విషయంలో కూడా ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక్క మాట లేదు. ఒక్కొక్కరిది ఒక్కో మాట. వీటన్నింటికీ కేంద్రం పార్లమెంటులో సమాధానం చెప్పింది.’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-08-03T17:08:37+05:30 IST