YCP: చప్పగా సాగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:37 PM
వైసీపీ ( YCP ) నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర చప్పగా సాగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిర్వహించిన బస్సు యాత్రకు ప్రజలను వివిధ తరలించాలని చూసినా అంతగా ఆసక్తి కనబరచడం లేదు. దీంతో వైసీపీ నేతలు తలలు పట్టుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా: వైసీపీ ( YCP ) నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర చప్పగా సాగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిర్వహించిన బస్సు యాత్రకు ప్రజలను వివిధ తరలించాలని చూసినా అంతగా ఆసక్తి కనబరచడం లేదు. దీంతో వైసీపీ నేతలు తలలు పట్టుకున్నారు. అలాగే సభకు వచ్చిన కొద్దిపాటి మంది కూడా సభ ప్రారంభం కాగానే వారందరూ వెనుదిరిగారు. స్థానిక నాయకులు మాట్లాడే సమయానికి మొత్తం ఖాళీ అయింది. వారి ప్రసంగాలను వినేందుకు జనం ఇష్టపడలేదు. సభ ప్రారంభమైన కోద్ది సేపటికే ఖాళీ కుర్చీలు కనపడ్డాయి. నాలుగు రోడ్ల కూడలి కాకుండా, జనం కనపడాలని ఒక రోడ్డులోనే సభ ఏర్పాటు చేశారు. నందిగామలో బహిరంగ సభ జరిగిన గాంధీ సెంటర్ నాలుగు రోడ్ల కూడలిలో సభ ఏర్పాటు చేశారు. జనం కనపడాలని మొదటి సారీ ఒక రోడ్డులో వైసీపీ నేతలు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కాగా బస్సు యాత్రకు జనాన్ని రప్పించేందుకు వైసీపీ నేతలు భారీగా మద్యాన్ని పంపిణీ చేశారు. దీంతో సమీప ప్రాంతాల్లో కొందరు మద్యం సేవిస్తూ కనిపించారు.
కర్నూలు జిల్లాలో..
కర్నూలు : జిల్లాలోని వన్‌టౌన్‌లో సామాజిక బస్సు యాత్రకు జనం నుంచి స్పందన అంతగా రావడం లేదు. బస్సు యాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే వైసీపీ కార్యకర్తలు, ప్రజలు ఇళ్లకు వెళ్లిపోయారు. సామాజిక బస్సు యాత్ర బహిరంగ సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తుడడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
దేవరపల్లిలో..
తూ.గో.జిల్లా : జిల్లాలోని దేవరపల్లిలో నిర్వహించిన వైసీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర బహిరంగ సభలో హోం మంత్రి తానేటి వనిత, రాష్ట్ర మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణు, ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతుండగానే మహిళలు వెనుతిరుగుతున్నారు. మహిళలు వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఆగకుండా మహిళలు వెళ్లిపోయారు.