MLC Candidates: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే..

ABN , First Publish Date - 2023-02-20T15:26:06+05:30 IST

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదలైంది.

MLC Candidates: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే..

అమరావతి: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ( YCP MLC Candidates List) విడుదలైంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల తుది జాబితాపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan Reddy) ఆమోద ముద్ర వేశారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajja Ramakrishna reddy) అభ్యర్థుల పేర్లను సోమవారం మీడియా ముఖంగా ప్రకటించారు. మొత్తం 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. అభ్యర్థుల్లో బీసీ 11, ఓసీ 4, ఎస్సీ 2, ఎస్టీ 1 ఉన్నారు. స్థానిక సంస్థల కోటాలో 9 మంది, ఎమ్మల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో ఇద్దరు అభ్యర్థుల పేర్లను సజ్జల (Adviser to aP Govt) వెల్లడించారు.

స్థానిక సంస్థల కోటా అభ్యర్థులు వీరే...

నార్తు రామారావు (బీసీ యాదవ, ఇచ్ఛాపురం)

కుడిపూడి సూర్యనారాయణ (బీసీ శెట్టిబలిజ, అమలాపురం)

వెంక రవీంద్రనాథ్ (ఓసీ కాపు, తణుకు)

కావూరు శ్రీనివాస్ (బీసీ శెట్టిబలిజ, పాలకొల్లు)

మేరుగ మురళీధర్ (ఎస్సీ మాల, గూడూరు)

సిపాయి సుబ్రహ్మణ్యం (బీసీ వెన్నెరెడ్డి, శ్రీకాళహస్తి)

పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి (ఓసీ రెడ్డి, జమ్మలమడుగు)

మధుసూదన్ (బీసీ వాల్మీకిబోయ, ఆదోని)

ఎస్.మంగమ్మ (బీసీ వాల్మీకబోయ, పెనుగొండ)

ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు :

పెన్మత్స సూర్యనారాయణరాజు (ఓసి క్షత్రియ, నెల్లిమర్ల)

పోతుల సునీత (బీసీ పద్మశాలి, చీరాల)

కోలా గురువులు (బీసీ వడబలిజ, విశాఖ సౌత్)

బొమ్మి ఇజ్రాయిల్ (ఎస్సీ మాదిగ, అమలాపురం)

జయమంగళ వెంకటరమణ (బీసీ వడ్డీ, కైకలూరు)

చంద్రగిరి ఏసురత్నం (బీసీ వడ్డెర, గుంటూరు వెస్ట్)

మర్రి రాజశేఖర్ (ఓసీ కమ్మ, చిలకలూరిపేట)

గవర్నర్ కోటా అభ్యర్థులు

కుంభా రవిబాబు (ఎస్టీ ఎరుకుల, అరకు)

కర్రి పద్మశ్రీ (బీసీ వాడబలిజ (మత్సకార), కాకినాడ సిటీ)

ఏళ్ల తర్వాత నెరవేరిన మర్రికిచ్చిన మాట..

గతంలో వైసీపీ పదవులు దక్కని వారు అనేక మంది అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. వారిలో మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajasheker Reddy) ఒకరు. వైసీపీ ప్రభుత్వంలో పదవి రాకపోయినా.. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ సుదీర్ఘకాలం వేచి చూశారు. వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట నడిచిన మర్రి.. 2014లో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై పోటీ చేసి ఓడిపోయారు.

మర్రికి ఈ సారి కచ్చితంగా ఎమ్మెల్సీ వస్తుందని ఆయన అభిమానులే కాదు పార్టీ నేతలు ఆశించారు. విడదల రజినీకి మంత్రి పదవి ఇచ్చే సమయంలోనే జగన్ మర్రికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. అందుకే.. ఆమెకు మంత్రి పదవి ఇచ్చినా.. రాజశేఖర్.. ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయలేదని చెప్పుకొచ్చారు. మర్రి అనుచరులు ఆశించినట్లుగానే ‘‘ఎన్నాళ్లో వేచిన ఉదయం’’ అన్నట్లుగా ఇన్నేళ్లకు ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్‌కు అవకాశం దక్కింది.

ycp-mlc-list.jpg

Updated Date - 2023-02-20T15:29:40+05:30 IST