PattabhiRam: సీఎం ప్రమేయంతోనే ఫోన్‌ ట్యాపింగ్

ABN , First Publish Date - 2023-02-02T12:52:50+05:30 IST

జగన్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్‌‌కు పాల్పడుతోందని తాము చెప్తున్నదే నేడు అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటపెట్టిన ఆధారాలలో నిజమైందని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.

PattabhiRam: సీఎం ప్రమేయంతోనే ఫోన్‌ ట్యాపింగ్

అమరావతి: జగన్ సర్కార్ (Jagan Government) ఫోన్ ట్యాపింగ్‌‌ (Phone Tapping) కు పాల్పడుతోందని తాము చెప్తున్నదే నేడు అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA KotamReddy SridharReddy) బయటపెట్టిన ఆధారాలలో నిజమైందని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (TDP Leader KommaReddy PattabhiRam) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... తనపై తనకు నమ్మకంలేక, ప్రజా విశ్వాసం కోల్పోయిన పులివెందుల పిల్లి ఫోన్ ట్యాపింగ్‌ని నమ్ముకున్నారని విరుచుకుపడ్డారు. సీఎం (AP CM Jaganmohan Reddy) ప్రమేయంతోనే నేడు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు గతంలోనే మంత్రి పెద్దిరెడ్డి (Minister PeddiReddy Ramachandra Reddy) మీడియా ముఖంగా ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ఇంటిలిజెన్స్ డీజీ ఫోన్ ట్యాప్ చేయిస్తే తప్పేమిటని గుడివాడ గుట్కా కొడాలినాని (Kodali Nani) అంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ఐటీ యాక్ట్ (IT Act), టెలిగ్రాఫ్ యాక్ట్‌ (Telegraph Act) లను తుంగలో తొక్కి మరీ జగన్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ చేస్తోందన్నారు. చీఫ్ సెక్రటరీ ఛైర్మన్‌గా ఉన్న కమిటీ అనుమతితోనే అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయాలని కేంద్రప్రభుత్వ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 419 (ఏ) (Section 419 (A) of the Union Indian Telegraph Act) చెబుతోందని ఆయన తెలిపారు.

వారికి తెలియకుండానే అనుమతిచ్చారా?...

పట్టాభి ఇంకా మాట్లాడుతూ... చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రికి తెలియకుండానే ప్రతిపక్ష, అధికారపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు అనుమతి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని గతంలో టీడీపీ (TDP) బహిర్గతం చేస్తే ప్రభుత్వం బుకాయించిందన్నారు. 2020లో ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంపై ప్రధాని (PM NarendraModi)కి చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఫిర్యాదు చేశారన్నారు. తక్షణమే కేంద్ర నిఘా సంస్థల (Central Intelligence Agency)తో దర్యాప్తుకు ఆదేశించాలని ప్రధానిని కోరారన్నారు. ఏపీ (Andhrapradesh State) లో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించమని లేఖ రాసే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి ఉన్నాయా? అని నిలదీశారు.

దర్యాప్తుకు ఆదేశించే ధైర్యం లేకపోతే జగన్ రెడ్డి (AP CM) తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా (Resignation) చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కర్ణాటక (Karnataka)లో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వస్తే, అప్పటి సీఎం రామకృష్ణ హెగ్డే (Ramakrishna Hegde) రాజీనామా చేశారని గుర్తుచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief) గతంలో ఫోన్ ట్యాపింగ్‌పై రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం (Central Government) వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీపై బురదజల్లడానికే గతంలో ప్రభుత్వం పెగాసస్ (Pegasus Issue) ఆరోపణలు చేసిందన్నారు. పెగాసస్‌పై అసెంబ్లీలో కమిటీలు వేసి, చర్చలు జరిపిన జగన్ సర్కార్ చివరకు చేతులెత్తేసి, నేడు తానే స్వయంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌కు వినియోగించే చట్టవ్యతిరేక సాఫ్ట్‌వేర్‌ను ఎవరి దగ్గర నుంచి ఎంతకు కొన్నారనే దానిపై కూడా దర్యాప్తు జరగాలని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-02-02T12:54:35+05:30 IST