Share News

Nara Lokesh: ఏపీ ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారింది

ABN , Publish Date - Dec 26 , 2023 | 09:56 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారిందని, పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Nara Lokesh: ఏపీ ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారింది

అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారిందని, పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ అంగన్‌వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, త్వరలో వాలంటీర్లు.. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టీడీపీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తోందన్నారు. అంగన్‌వాడీల సమ్మెకు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మద్దతు తెలిపాయో.. అలానే సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు కూడా మద్దతు తెలపాలని పిలుపు ఇస్తున్నామని నారా లోకేష్ స్పష్టం చేశారు.

Updated Date - Dec 26 , 2023 | 09:56 AM