Kollu Ravindra: డైవర్ట్ పాలిటిక్స్‌కు జగన్ తెర

ABN , First Publish Date - 2023-02-01T13:02:52+05:30 IST

ఏపీ సీఎం జగన్ రెడ్డికి బాబాయ్ హంతకులను కాపాడటంలో ఉన్న శ్రద్ద రాష్ట్ర ప్రజలపై లేదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Kollu Ravindra: డైవర్ట్ పాలిటిక్స్‌కు జగన్ తెర

అమరావతి: ఏపీ సీఎం జగన్ రెడ్డి (AP CM JaganMohanReddy)కి బాబాయ్ (YS Viveka Case) హంతకులను కాపాడటంలో ఉన్న శ్రద్ద రాష్ట్ర ప్రజలపై లేదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Former Minister Kollu Ravindra) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... బాబాయ్ హంతకులను కాపాడేందుకు... విశాఖ రాజధాని అంటూ... సుప్రీం కోర్టు (Supreme Court)లో ఉన్న విషయాన్ని తెరమీదకు తెచ్చి డైవర్ట్ పాలిటిక్స్‌ (Divert politics)కు తెరలేపారని మండిపడ్డారు. లిక్కర్ స్కాం (Liquor scam)లో భార్య పేరు బయటకు రాగానే ఎన్టీఆర్ యూనివర్సిటీ (NTR University) పేరు తెరపైకి తీసుకువచ్చి ఆ విషయాన్ని కూడా డైవర్ట్ చేశారన్నారు. ‘‘నాడు రాజధాని (AP Capital)కి ౩౦ వేలు ఎకరాలు కావాలన్నావు, ఇల్లు ఇక్కడే కట్టాను అన్నావు, ఇప్పుడు రాజధాని విశాఖ (Visakhapatnam) అంటున్నావు ఇది మోసం కదా జగన్ రెడ్డి’’ అని ఆయన ప్రశ్నించారు.

జగన్ రెడ్డి (YCP Chief) ఇంకా రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనే చూస్తున్నారన్నారు. బాబాయ్ హత్య కేసులో సీబీఐ (CBI) దూకుడు పెంచగానే జగన్ రెడ్డి (AP CM) పరిగెత్తుకుంటూ వెళ్లి ఢిల్లీ (Delhi)పెద్దల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారని యెద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడైనా ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపారా అని నిలదీశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. తమ ప్రాణాలను అడ్డువేసైనా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుతామని స్పష్టం చేశారు. జగన్ (YS JaganMohanReddy) ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా... ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటామని, ప్రజాస్వామ్యబద్ధంగా బుద్ధిచెబుతామని కొల్లురవీంద్ర తెలిపారు.

Updated Date - 2023-02-01T13:02:53+05:30 IST