Tulasireddy: ‘అచ్చే దిన్‌కు బదులు చచ్చే దినాలు దాపురించాయి’

ABN , First Publish Date - 2023-03-02T12:32:41+05:30 IST

గ్యాస్ ధరల పెంపుపై మాజీ రాజ్యసభ సభ్యులు, ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్.తులసి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tulasireddy: ‘అచ్చే దిన్‌కు బదులు చచ్చే దినాలు దాపురించాయి’

అమరావతి: గ్యాస్ ధరల పెంపుపై మాజీ రాజ్యసభ సభ్యులు, ఏపీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్.తులసి రెడ్డి (Congress Leader TulasiReddy)ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Government) వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్‌పై రూ.350లు పెంచడం గర్హనీయమన్నారు. 2014లో కేంద్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 114 డాలర్లు ఉన్నప్పుడు ప్రజలకు వంట గ్యాస్ సిలిండర్‌ను రూ.410 లకు సరఫరా చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 90 డాలర్లే ఉన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను దాదాపు రూ.1200 చేయడం శోచనీయమని మండిపడ్డారు. గృహిణులు వంట గదిలోకి పోవాలంటే భయపడి పోతున్నారన్నారు. మోడీ పాలనలో అచ్చే దిన్‌కు బదులు చచ్చే దినాలు దాపురించాయని విమర్శించారు. సబ్ కా వికాస్ బదులు సబ్ కా వినాస్ జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తుందని తులసిరెడ్డి హామీ ఇచ్చారు.

Updated Date - 2023-03-02T12:32:57+05:30 IST