AP Capital Issue: సుప్రీంలో అమరావతిపై విచారణ... ఢిల్లీలో జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-01-31T13:24:35+05:30 IST

ఏపీ రాజధానిపై సీఎం జగన్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

AP Capital Issue: సుప్రీంలో అమరావతిపై విచారణ... ఢిల్లీలో జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఏపీ రాజధాని (AP Capital)పై సీఎం జగన్‌ రెడ్డి (CM Jaganmohan Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సు (Delhi Investors Conference) లో ఏపీ రాజధాని విశాఖ (AP Capital Visakhapatnam) అంటూ జగన్ (YS Jagan Mohan Reddy) స్పష్టం చేశారు. ఏపీ మూడు రాజధానులపై సుప్రీం కోర్టు (Supreme Court)లో విచారణలో ఉన్న సమయంలోనే కాబోయే రాజధాని విశాఖకు రావాలని ఇన్వెస్టర్లను కోరారు. తాము త్వరలోనే విశాఖకు మారబోతున్నామని చెప్పారు.

అయితే జగన్‌ ప్రకటనను న్యాయనిపుణులు తప్పుపడుతున్నారు. కోర్టు విచారణలో ఉండగానే విశాఖను రాజధానిగా ఎలా భావిస్తారని ప్రశ్నిస్తున్నారు. జగన్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారణ కిందకు వస్తాయని న్యాయనిపుణులు తెలిపారు. నేడు సుప్రీం కోర్టులో అమరావతిపై విచారణ జరుగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

కాగా... అమరావతి రాజధానికి సంబంధించి ఏపీ హైకోర్టు(AP Highcourt) త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ‘‘2014 ఆంధ్రప్రదేశ్ పున:ర్విభజన చట్టం ప్రకారం రాజధాని అమరావతిగా ఏపీ అసెంబ్లీ (AP Assembly) ఏకగ్రీవంగా తీర్మానం చేశాక దానిపై మరోసారి తీర్మానం చేసేందుకు లెజిస్టేటివ్ కాంపటెన్సివ్ లేదు’’ అని స్పష్టం చేసింది. దీంతో పాటు రాజధాని రైతులు(Capital Farmers) 33వేల573 ఎకరాలు ఇచ్చిన సమయంలో రైతులకు, సీఆర్డీవోకు మధ్య రద్దు పరచడానికి వీలులేని ఒప్పందం జరిగిందని పేర్కొంది. ఈ ప్రకారం రైతులకు ఇచ్చిన హామీని ఎలా విస్మరిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై శాసనసభకు లెజిస్లేటివ్ కాంపెటెన్సివ్ లేనందున స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే సుప్రీం కోర్టు కూడా దీనిపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. త్రిసభ్య ధర్మాసనంలో 250 మంది వాదప్రతివాదులను అందరినీ కూడా కౌంటర్ వేయాల్సిందిగా సుప్రీం ఆదేశించింది. సుప్రీం కోర్టు స్టే ఇవ్వకుండా... రాష్ట్ర హైకోర్టు తీర్పు అమలులో ఉన్న సమయంలో రాష్ట్ర రాజధానిని విశాఖకు మారుస్తామని ఎలా ప్రకటిస్తారంటూ జగన్‌ను న్యాయనిపుణులు ప్రశ్నిస్తున్నారు. సీఎం వ్యాఖ్యలపై రాజధాని రైతులు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Updated Date - 2023-01-31T14:09:07+05:30 IST