Attorney General: ఆ కారణంగా సీఎం జగన్‌పై నిర్ణయం తీసుకోలేను...

ABN , First Publish Date - 2023-02-13T15:28:26+05:30 IST

రాజధాని తరలింపుపై ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోర్టుధిక్కార నేరం కింద పరిగణించాలని

Attorney General: ఆ కారణంగా సీఎం జగన్‌పై నిర్ణయం తీసుకోలేను...

అమరావతి: రాజధాని (AP Capital) తరలింపుపై ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan Reddy)చేసిన వ్యాఖ్యలను కోర్టుధిక్కార నేరం కింద పరిగణించాలని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్‌ (Jai Bheem Bharat Party President Jada Shravan)లేఖపై అటార్నీ జనరల్ వెంకటరమణి (Attorney General Venkataramani) స్పందించారు. గత నెలలో ఢిల్లీలో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సు (Global Investors Summit Delhi) లో విశాఖ (Visakhapatnam) రాజధాని కాబోతుందంటూ సీఎం (AP CM) ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు (Supreme Court)లో కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇటువంటి ప్రకటన న్యాయవ్యవస్థ స్వతంత్రతకు భంగం కలిగించడమే అని పేర్కొన్నారు. సీఎంపై సూమోటో కంటెంట్ (Sumoto Contempt on CM) తీసుకోవాలని సుప్రీంకోర్టు రిజిస్టార్ (Supreme Court Registrar), అటార్నీ జనరల్ ఆఫ్‌ ఇండియా (Attorney General of India)కు శ్రావణ్ లేఖ రాశారు.

అయితే... గతంలో తాను ఏపీ ప్రభుత్వం (AP Government) తరపున కేసులు వాదించి ఉండటంతో దీనిపై నిర్ణయం తీసుకోలేనని పేర్కొంటూ శ్రావణ్‌‌కు అటార్నీ జనరల్ తిరిగి లేఖ రాశారు. ఈ లేఖపై చర్యలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ ఆఫ్‌ ఇండియా (Solicitor General of India)కు లేఖ పంపుతున్నట్టు పేర్కొన్నారు. దీనిపై శ్రావణ్ కుమార్ స్పందిస్తూ... రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉండగా ప్రకటనలు చేయడంపై సూమోటో కంటెంప్ట్ కేసు తీసుకునేందుకు చర్యలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. సోలిసిటర్ జనరల్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని నమ్మకం ఉందని శ్రావణ్‌ కుమార్ పేర్కొన్నారు.

కాగా... ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రాజధానిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. త్వరలో విశాఖ రాజధాని కాబోతోందోని.. తాను కూడా అక్కడకు మారబోతున్నట్లు ఏపీ సీఎం సంచలన కామెంట్లు చేశారు. సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి కేసుపై విచారణ జరుగుతున్న సమయంలో రాజధానిపై సీఎం జగన్ చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-02-13T15:36:44+05:30 IST