Minister Roja Upset: హర్ట్ అయిపోయి... ముఖం తిప్పుకుని వెళ్లిన మంత్రి రోజా !

ABN , First Publish Date - 2023-02-15T14:35:58+05:30 IST

ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజాకు అవమానం జరిగింది.

Minister Roja Upset: హర్ట్ అయిపోయి... ముఖం తిప్పుకుని వెళ్లిన మంత్రి రోజా !

విజయవాడ: ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజా (AP Tourism Minister Roja)కు అవమానం జరిగింది. ఓ షాపింగ్‌ మాల్ ప్రారంభోత్సవానికి అతిథిగా వెళ్లిన సమయంలో రోజాకు పవన్ అభిమానులు (Pawan Fans) షాక్ ఇచ్చారు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ అభిమానులు సందడి చేశారు. దీంతో మంత్రి రోజా (AP Minister) ముఖం తిప్పుకుని వెళ్లిపోయారు.

బుధవారం విజయవాడ బందర్ రోడ్డులోని బీఎన్ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవానికి నటి అనుపమా పరమేశ్వర్‌ (Actress Anupama Parameshwar)తో పాటు ఏపీ మంత్రి రోజా ముఖ్య అతిథిగా వెళ్లారు. నటి అనుపమ(Actress Anupama)ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు (Fans) షాపింగ్ మాల్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడి రోడ్లన్నీ బ్లాక్ అయిన పరిస్థితి నెలకొంది. అయితే షాపింగ్ మాల్ వద్ద మంత్రి రోజా కారు దిగిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) అభిమానులు ‘‘ జై జై బాబు పవన్ బాబు’’ అంటూ కోలాహలం చేశారు. సీఎం కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ అభిమానులు చేసిన సందడికి మంత్రి రోజాకు మొహం మాడిపోయింది. అభిమానుల వంక కూడా చూడకుండా.. మొహం తిప్పుకుని రోజా షాపింగ్ మాల్ లోపలికి వెళ్లిపోయారు. అయితే రోజాకు పెద్ద అవమానమే జరిగిదంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. పవన్‌పై రోజా ఇటీవల కాలంలో చేసిన వ్యాఖ్యల పట్ల అభిమానులు, ప్రజల్లో ఆమె పట్ల విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో షాపింగ్‌ మాల్‌కు వచ్చిన రోజాకు పవన్ అభిమానులు పెద్ద షాక్ ఇచ్చినట్లైంది.

Updated Date - 2023-02-15T14:44:36+05:30 IST