Taneti Vanitha: ‘40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి మాట్లాడేది ఇలానా?’

ABN , First Publish Date - 2023-02-23T15:10:05+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై హోంమంత్రి తానేటి వనిత విరుచుకుపడ్డారు.

Taneti Vanitha: ‘40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి మాట్లాడేది ఇలానా?’

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (TDP Chief Chandrababu Naidu)పై హోంమంత్రి తానేటి వనిత (HomeMinister Taneti Vanitha) విరుచుకుపడ్డారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు (TDP Chief) పోలీసులను కించపరుస్తూ మాట్లాడటం సరికాదన్నారు. గురువారం విజయవాడ క్యాపిటల్ ఆసుపత్రికి చేరుకున్న హోంమంత్రి (AP Home Minister) గన్నవరం ఘటనలో గాయపడిన సీఐ కనకరావు (CI Kanakarao) ను పరామర్శించారు. అనంతరం హోంమంత్రి వనిత మీడియాతో మాట్లాడుతూ... గన్నవరం (Gannavaram)లో జరిగిన దాడులో గాయాలపాలైన సీఐని పరామర్శించినట్లు తెలిపారు. ఇలాంటి దాడులను పూర్తిగా ఖండిస్తున్నామని.. పోలీసులు డ్యూటీ చేయడం వల్లనే అందరూ హ్యపీగా ఉంటున్నారన్నారు. ఏదో రకంగా ప్రభుత్వం (AP Government)పై బురద జల్లడానికే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారన్నారని హోంమంత్రి అన్నారు.

అనపర్తి (Anaparthi)లో ఉద్దేశపూర్వకంగా సభకు అనుమతులు లేకున్నా పోలీసులను ఇబ్బందులు పెట్టడానికి మూర్ఖత్వంగా వ్యవహరించారని మండిపడ్డారు. పోలీసులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లోకేష్ (TDP Leader Lokesh) కూడా ఉద్దేశపూర్వకంగానే టేబుల్‌పై నుంచుని మరీ సభలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి (Kommareddy Pattabhi Ram) కోర్టులో తనపై థర్డ్ డిగ్రీ (Third Degress) జరిగిందంటూ ఆరోపణలు చేశారని.. అబద్ధాలకు పట్టాభిషేకం చేస్తే ఎలా ఉంటాడో పట్టాభి అలాగే ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. ‘‘గెదె చేలో మేస్తే దూడ ఎక్కడ మేస్తుందో..’’ అదే విధంగా టీడీపీ (TDP) వ్యవహారం ఉందన్నారు. ప్రభుత్వాన్ని, పోలీసులను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురిచేస్తున్నారని తానేటి వనిత విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-02-23T15:25:40+05:30 IST