AP Budget : 2023-24 ఏపీ బడ్జెట్ హైలైట్స్ ..

ABN , First Publish Date - 2023-03-16T10:40:03+05:30 IST

2023- 24 వార్షిక బడ్జెట్‌ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు.

AP Budget : 2023-24 ఏపీ బడ్జెట్ హైలైట్స్ ..

అమరావతి: 2023- 24 వార్షిక బడ్జెట్‌ (Annual Budget 2023-24)ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి (AP Minister Buggan Rajendranath Reddy) గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రెండు లక్షల 79 వేల 279.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను మంత్రి సభ ముందు ఉంచారు. ముందుగా పోతన పద్యంతో బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి మొదలుపెట్టారు. బడ్జెట్ రూపకల్పనలో భాగ్యస్వాములకు కృతజ్ఞతలు తెలియజేశారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు...

  • రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో ఏపీ బడ్జెట్

  • ఆర్థిక శాఖకు రూ.72,424 కోట్లు కేటాయింపు

  • వైద్య, ఆరోగ్య శాఖకు రూ.15,882 కోట్లు

  • వ్యవసాయ రంగానికి రూ.11,589 కోట్లు

  • పశుసంవర్ధక శాఖకు రూ.1787 కోట్లు

  • బీసీ సంక్షేమ శాఖకు రూ.23,509 కోట్లు

  • పర్యావరణానికి రూ.685 కోట్లు

  • జీఏడీకి రూ.1418 కోట్లు కేటాయింపు

  • హోంశాఖకు రూ.8206 కోట్లు కేటాయింపు

  • గృహనిర్మాణ శాఖకు రూ.6292 కోట్లు

  • గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3858 కోట్లు

  • నీటిపారుదల రంగానికి రూ.11,908 కోట్లు

  • పరిశ్రమలు, వాణిజ్యం రూ.2602 కోట్లు

  • మౌలిక వసతులు, పెట్టుబడులకు రూ.1295 కోట్లు

  • కార్మిక శాఖకు రూ.796 కోట్లు,

  • ఐటీ శాఖకు రూ.215 కోట్లు

  • న్యాయశాఖకు రూ.1058 కోట్లు కేటాయింపు

  • అసెంబ్లీ, సెక్రటేరియట్‌ రూ.111 కోట్లు

  • పట్టణాభివృద్ధికి రూ.9381 కోట్లు కేటాయింపు

  • మైనార్టీ సంక్షేమానికి రూ.2240 కోట్లు కేటాయింపు

  • నగదు బదిలీ పథకాలకు రూ.54 వేల కోట్లు

  • ఇంధన శాఖకు రూ. 6546 కోట్లు కేటాయింపు

  • అగ్రవర్ణ పేదల సంక్షేమానికి రూ. 11,085 కోట్లు

  • సివిల్ సప్లై - రూ. 3725 కోట్లు, జీఏడీకి రూ.1,148 కోట్లు

  • పబ్లిక్ ఎంటర్‌ ప్రైజెస్ రూ.1.67 కోట్లు, ప్రణాళిక 809 కోట్లు

  • రెవెన్యూ రూ.5380 కోట్లు, రియల్ టైం గవర్నెస్ రూ.73 కోట్లు

  • స్కిల్‌డెవలప్‌మెంట్‌కు రూ. 1167 కోట్లు

  • సాంఘిక సంక్షేమం రూ.14511 కోట్లు, R&Bకి రూ.9119 కోట్లు

  • స్త్రీ, శిశు సంక్షేమం రూ.3951 కోట్లు

  • యూత్, టూరిజం రూ.291 కోట్లు

  • డీబీటీ స్కీమ్‌లకు రూ.54,228.36 కోట్లు కేటాయింపు

  • పెన్షన్లు రూ.21,434 కోట్లు

  • రైతు భరోసాకు రూ.4020 కోట్లు

  • జగనన్న విద్యా దీవెనకు రూ.2842 కోట్లు

  • వసతి దీవెనకు రూ.2200 కోట్లు

  • వైఎస్సార్ పీఎమ్ బీమా యోజనకు రూ. 700 కోట్లు

  • డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.300 కోట్లు

  • రైతులకు వడ్డీ లేని రుణాలకు రూ.500 కోట్లు

  • కాపు నేస్తం రూ.550 కోట్లు

  • జగనన్న చేదోడుకు రూ.350 కోట్లు

  • వాహనమిత్ర రూ.275 కోట్లు

  • నేతన్న నేస్తం రూ.200 కోట్లు

  • మత్స్యకార భరోసా రూ.125 కోట్లు

  • మత్స్యకారులకు డీజిల్ సబ్సిడి రూ.50 కోట్లు

  • ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు

  • వైఎస్సార్ కళ్యాణమస్తు రూ.200 కోట్లు

  • వైఎస్సార్ ఆసరా రూ.6700కోట్లు

  • వైఎస్సార్ చేయూత రూ.5000 కోట్లు

  • అమ్మఒడి రూ.6500 కోట్లు

  • బీసీ కార్పొరేషన్‌కు రూ.22,715 కోట్లు

  • ఎస్పీ కార్పొరేషన్‌కు రూ.8384.93 కోట్లు

  • ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2428 కోట్లు

  • ఈబీసీ కార్పొరేషన్‌కు రూ.6165 కోట్లు

  • కాపు కార్పొరేషన్‌కు రూ.4887 కోట్లు

  • క్రిస్టియన్ కార్పొరేషన్‌కు రూ.115.03 కోట్లు

  • బ్రాహ్మణ కార్పొరేషన్ రూ.346.78 కోట్లు

  • మైనారిటీ కార్పొరేషన్‌కు రూ.1868.25 కోట్లు కేటాయింపు

సభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్...

టీడీపీ సభ్యుల (TDP MLAs) నిరసన ధ్వనుల మధ్యే మంత్రి బుగ్గన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM YS jaganmohan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitharam) ఫైర్ అయ్యారు. సభా కార్యకలాపాలను టీడీపీ సభ్యులు అడ్డుకోవడం సరికాదని స్పీకర్ అన్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను సీఎం జగన్ కోరారు. టీడీపీ సభ్యులు ఎంత చెప్పినా వినకపోవడంతో స్పీకర్ సీరియస్ అయ్యారు. బడ్జెట్ ప్రవేశపెడుతుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. తెలుగుదేశం సభ్యుల నినాదాలతో అసెంబ్లీ హోరెత్తింది. టీడీపీ ఉద్దేశపూర్వకంగానే అసెంబ్లీని అడ్డుకుంటున్నారని మంత్రి బుగ్గన అన్నారు. అసెంబ్లీ సంప్రదాయాలను పాటించాలన్నారు. చివరకు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ బుగ్గన తీర్మానం చేయగా.. అందుకు స్పీకర్ ఆమోదం తెలిపారు. సభ నుంచి 13 మంది సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తమను సస్పెండ్ చేయడంపై టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-16T11:17:24+05:30 IST