Kotamreddy : ఆ ఆడియోలు రిలీజ్ చేస్తే మరుసటి రోజే సజ్జల పోస్ట్ ఊడిపోతుంది

ABN , First Publish Date - 2023-02-03T11:51:26+05:30 IST

తన గొంతును ఆపాలంటే తనను ఎన్‌కౌంటర్ చేయడం ఒక్కటే దారని.. తాను చచ్చిపోతేనే తన మాటలు ఆగుతాయని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.

Kotamreddy : ఆ ఆడియోలు రిలీజ్ చేస్తే మరుసటి రోజే సజ్జల పోస్ట్ ఊడిపోతుంది

అమరావతి : తన గొంతును ఆపాలంటే తనను ఎన్‌కౌంటర్ చేయడం ఒక్కటే దారని.. తాను చచ్చిపోతేనే తన మాటలు ఆగుతాయని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy) పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారం ఉంది కదా అని తనపై మాటల దాడి చేస్తున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)పై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఇసుకాసురులు, మద్యం వ్యాపారుల ఆడియోలు రిలీజ్ చేస్తే.. మరుసటి రోజే సజ్జల పోస్ట్ ఊడిపోతుందన్నారు. తనను అరెస్ట్ చేస్తారంటూ సజ్జల లీకులు ఇస్తున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు.

తమ్ముడు అనిల్‌కుమార్ (Anil Kumar) వ్యాఖ్యలు తనను బాధించాయని కోటంరెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్‌ (CM Jagan)కు నమ్మకద్రోహం చేసి ఉంటే.. తనను సర్వనాశనం చేయాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. తప్పు చేయకుండా ఉంటే దేవుడు తనకు అండగా ఉంటాడన్నారు. గతంలో అనిల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే తన కుటుంబం అల్లాడిందని కోటంరెడ్డి పేర్కొన్నారు. తన కుటుంబం.. అనిల్ కుటుంబం వేరని ఎప్పుడూ అనుకోలేదని కోటంరెడ్డి తెలిపారు.

ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలని.. కానీ పిల్లల ప్రస్తావన ఎందుకని కోటంరెడ్డి ప్రశ్నించారు. చిత్తశుద్ధితో పనిచేస్తే తనను అనుమానించారన్నారు. అనుమానించిన చోట ఉండకూడదని ఆలోచించానన్నారు. అందుకే అధికారాన్ని వదులుకున్నానన్నారు. ట్యాపింగ్‌పై విచారణ జరపకుండా సమస్యను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. గతంలో చంద్రబాబు (Chandrababu)ను అనిల్ ఎందుకు కలిశారని ప్రశ్నించారు. బెంజ్ కారులో వెళ్లి కలిస్తే అప్పుడు నిఘా ఏమైందని కోటంరెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2023-02-03T11:51:29+05:30 IST