Kirankumar Reddy : నాకు, రాహుల్ గాంధీకి మధ్య కొన్ని అంశాలపై చర్చ జరిగింది

ABN , First Publish Date - 2023-04-12T15:44:51+05:30 IST

బీజేపీలో ఎందుకు చేరానో ఇప్పటికే స్పష్టంగా చెప్పానని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అరవై సంవత్సరాలు పైన తమ కుటుంబం కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్నారు.

Kirankumar Reddy : నాకు, రాహుల్ గాంధీకి మధ్య కొన్ని అంశాలపై చర్చ జరిగింది

విజయవాడ : బీజేపీలో ఎందుకు చేరానో ఇప్పటికే స్పష్టంగా చెప్పానని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అరవై సంవత్సరాలు పైన తమ కుటుంబం కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్నారు. వివిధ పరిణామాలు వల్ల రాష్ట్ర విభజనను వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చామన్నారు. విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలకు అనుగుణంగా నడవాలన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న సమయంలో మళ్లీ కాంగ్రెస్‌లో చేరానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘నాయకులు నిర్ణయం తీసుకునే ముందు ఆలోచన చేయాలి. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి పని‌ చేయాలని చూశాను. కానీ అక్కడ నిర్ణయాలు ఒక్కో రాష్ట్రంలో పార్టీ దెబ్బ తినే పరిస్థితి ఉంది.

నాకు, రాహుల్ గాంధీకి మధ్య కొన్ని అంశాల పై చర్చ జరిగింది. పీసీసీసి అధ్యక్షుడు ఇస్తాం అన్నారు.‌ వద్దు అని చెప్పా. నీళ్లు బాటిల్ నుంచి పడకముందే జాగ్రత్త ఉండాలి. కింద పడ్డాక.. మళ్లీ ఆ నీళ్లను సీసాలో పోయలేం అనే‌ విషయాన్నే వాళ్లకి చెప్పా. అయినా అందరం కలిసి పని చేసి కాంగ్రెస్ కి ఓటు శాతం పెంచాం. కాంగ్రెస్ బలోపేతం అవుతున్న సమయంలో టీడీపీతో పొత్తుకు వెళ్లారు. ఎవరినీ అడగకుండా, చర్చించకుండా నిర్ణయాలు వల్ల బయటకి వచ్చా. మోదీ‌ పాలన నచ్చి... ప్రజలకు మంచి చేయవచ్చనే నమ్మకంతో‌ బీజేపీలో ‌చేరాను. మా నాన్న కాలం నుంచి‌ నేను రాజకీయాల్లో ఉంటున్నా. ఇందిరా గాంధీ సమయం నుంచీ‌ కాంగ్రెస్ బలోపేతం అయిన‌ పరిస్థితి కూడా వాళ్ల కి చెప్పా. అయినా కాంగ్రెస్ బలోపేతంపై‌ వారు దృష్టి పెట్టలేదు. బీజేపీ గ్రామ స్థాయిలో బలం పెంచుకునే కార్యక్రమం చేపట్టింది.

1984లో దేశంలో బీజేపీకి రెండు సీట్లు ఉంటే.. . కాంగ్రెస్‌కి‌ 404 సీట్లు. 2014లో ఏడు శాతం నుంచి‌31శాతం బీజేపీకి ప్రజా మద్దతు పెరిగింది. కాంగ్రెస్‌కి 19.3శాతం 44 సీట్లు వచ్చాయి. 2019లో బీజేపీకి 303, కాంగ్రెస్‌కి 52 సీట్లు వచ్చాయి. ఎన్నికలలో గెలుపు, ఓటమి సహజం అయినా... పరిస్థితి బట్టి నిర్ణయాలు ఉండాలి. ప్రజల మధ్యన నేను ఉండాలా లేదా అని ఆలోచించా. కాంగ్రెస్ వల్ల ప్రజలకు చేరువ కాలేనని అర్ధం అయ్యింది. బీజేపీలో ఉంటే ప్రజలకు దగ్గర కావచ్చనే నేను చేరాను. అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది త్వరలోనే మాట్లాడతా. అన్ని‌ ప్రాంతీయ పార్టీల తీరు పైనా అప్పుడు స్పందిస్తా. బీజేపీ బలోపేతం కోసం నా వంతుగా కృషి చేస్తా’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-04-12T15:44:51+05:30 IST