CBI Court: జగన్‌ యూకే పర్యటనపై సీబీఐ కోర్టులో విచారణ.. మరికాసేపట్లో తీర్పు

ABN , First Publish Date - 2023-08-30T12:24:19+05:30 IST

యూకే పర్యటనకు అనుమతి కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.

CBI Court: జగన్‌ యూకే పర్యటనపై సీబీఐ కోర్టులో విచారణ.. మరికాసేపట్లో తీర్పు

హైదరాబాద్: యూకే పర్యటనకు అనుమతి కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సీబీఐ కోర్టులో (CBI court) విచారణ జరిగింది. ఫ్యామిలీ వెకేషన్ కోసం లండన్‌‌కు వెళ్లాలని అనుమతి ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు తన కూతురు దగ్గరకు వెళ్లాని జగన్ కోరారు. అయితే జగన్ పిటిషన్‌పై సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డి (YCP MP Vijayasaireddy) పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్, సింగపూర్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని విజయసాయిరెడ్డి తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం విదేశాలకు వెళ్లాలని వాదించారు. జగన్, విజయ్ సాయి రెడ్డి పిటిషన్‌లపై వాదనలు ముగిశాయి. టూర్‌కు అనుమతి ఇవ్వద్దని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. రెండు పిటిషన్‌లపై వాదనలు ముగియగా.. మరికాసేపట్లో సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది.

Updated Date - 2023-08-30T12:24:19+05:30 IST