Share News

Nara Bhuvaneshwari: నేడు విజయనగరం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

ABN , First Publish Date - 2023-10-31T10:04:05+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.

Nara Bhuvaneshwari: నేడు విజయనగరం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

విజయనగరం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. ఉదయం రాజమహేంద్రవరంలో బయలుదేరి రోడ్డు మార్గంలో నారా భువనేశ్వరి విజయనగరానికి చేరుకుంటారు. చెల్లూరు జంక్షన్ వద్ద ఉదయం 11:00 గంటలకు నారాభువనేశ్వరికి ఉమ్మడి విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి నేరుగా జిల్లా కేంద్ర ఆస్పపత్రి (MR ఆస్పత్రి)లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఈ పర్యటనలో టీడీపీ నేతలు పాల్గొనాలని తెలిపారు. ఈ మేరకు టీడీపీ పార్టీ అధిష్ఠానం ఓ ప్రకటనను విడుదల చేసింది.

Updated Date - 2023-10-31T10:07:17+05:30 IST