Undavalli Sridevi: టీడీపీ కార్యాలయానికి వచ్చిన ఉండవల్లి శ్రీదేవి.. ఏమన్నారంటే..?

ABN , First Publish Date - 2023-09-12T15:04:25+05:30 IST

త్వరలోనే తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) బెయిల్‌పై వచ్చి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి(MLA Undavalli Sridevi) వ్యాఖ్యానించారు.

Undavalli Sridevi: టీడీపీ కార్యాలయానికి వచ్చిన ఉండవల్లి శ్రీదేవి.. ఏమన్నారంటే..?

గుంటూరు జిల్లా: త్వరలోనే తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) బెయిల్‌పై వచ్చి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి(MLA Undavalli Sridevi) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయానికి ఉండవల్లి శ్రీదేవి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుని అరెస్టు చేసిన విధానం సరిగా లేదు. ఏదో ఫ్యాక్షనిస్టు, నేరగాడిలా అక్రమంగా అరెస్టు చేసి తరలించారు.అయినా చంద్రబాబు అదరలేదు. కార్యకర్తల్లో ధైర్యం నింపారు.రానున్న ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితం అవటం ఖాయం.తాత్కాలికంగా పాపం గెలవొచ్చు.. కానీ అంతిమ విజయం సత్యానిదే.చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.పులి ఒక అడుగు వెనక్కు వేస్తే బయపడినట్లు కాదు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు సీఎం అవ్వటం ఖాయమని ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-12T15:05:33+05:30 IST