AP High Court: ఆ 16 మంది నేతలకు ఉపశమనం.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
ABN , First Publish Date - 2023-09-25T22:11:32+05:30 IST
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం రంగన్నగూడెంలో జరిగిన ఘటనలకు సంభంధించిన కేసులో 16 మంది తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)నేతలకు ఏపీ హైకోర్టు(AP High Court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

అమరావతి: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం రంగన్నగూడెంలో జరిగిన ఘటనలకు సంభంధించిన కేసులో 16 మంది తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)నేతలకు ఏపీ హైకోర్టు(AP High Court) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా జరిగిన ఘటనపై టీడీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకటరావుతో సహా 17 మందిపై ఏపీ పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఇందులో 16మందికి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. 16 మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. 16 మందికి ముందస్తు బెయిల్ మంజూరు హైకోర్టు తీర్పు చెప్పింది .