Share News

Pawan Kalyan: చంద్రబాబు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు

ABN , First Publish Date - 2023-10-31T13:17:15+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అన్నారు.

Pawan Kalyan: చంద్రబాబు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అన్నారు. మంగళవారం నాడు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు బెయల్‌పై స్పందించారు. ‘‘చంద్రబాబుకి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో.. ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు బెయిల్‌పై రావడాన్ని అందరం ఆయన్ని స్వాగతిద్దాం’’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Updated Date - 2023-10-31T14:33:17+05:30 IST