Ashok Babu: టీడీపీకి కొత్తదారి చూపించిన జగన్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-09-23T15:37:00+05:30 IST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) గెలుపును ఆపడం.. ప్రజా జీవితం నుంచి ఆయన్ని విడదీయడం ఎవరితరంకాదని ఆ పార్టీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు(Paruchuri Ashok Babu) వ్యాఖ్యానించారు.

Ashok Babu: టీడీపీకి కొత్తదారి చూపించిన జగన్‌రెడ్డి

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) గెలుపును ఆపడం.. ప్రజా జీవితం నుంచి ఆయన్ని విడదీయడం ఎవరితరంకాదని ఆ పార్టీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు(Paruchuri Ashok Babu) వ్యాఖ్యానించారు. శనివారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘అవినీతి కేసుల్లో పదేళ్లు బెయిల్‌పై బయట ఉన్న జగన్‌రెడ్డి(Jagan Reddy), ప్రజాసేవకుడైన చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపాడు. టీడీపీ ప్రభుత్వం మున్ముందు ఎలా ముందుకెళ్లాలనే దానిపై జగన్‌రెడ్డి కొత్తదారి చూపించాడు. భవిష్య‌త్‌లో జగన్‌రెడ్డి అతని కేబినెట్ మొత్తం జైల్లో చిప్పకూడు తింటుంది. చంద్రబాబుతో పెట్టుకొని జగన్ తప్పుచేశాడని వైసీపీ నేతలే అంటున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుపై జీవోలు ఇచ్చిన నీలం సహానీ, నిధులు విడుదల చేసిన ప్రేమచంద్రారెడ్డిలను ఎందుకు విచారించలేదో బుర్రకథల బుగ్గన చెప్పాలి. డిజైన్ టెక్ సంస్థ ఎంపిక చేసుకున్న స్కిల్లర్ సంస్థ మరికొన్ని కంపెనీలతో వ్యాపార వ్యవహారాలు నడిపితే, అవి షెల్ కంపెనీలు అవుతాయా బుగ్గనా?. అమరావతిలో వేయని ఇన్నర్ రింగురోడ్డు , ఫైబర్ గ్రిడ్(Inner Ring Road, fiber Grid)అని కొత్త కొత్త అభియోగాలు మోపుతున్నారు. ఒక దాని తర్వాత మరోటి తెరపైకి తెస్తూ ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తమ పతనాన్ని తామే కోరి తెచ్చుకుంటున్నారు. చంద్రబాబు విషయంలో తప్పుచేసిన అధికారులు, నేతలకు టీడీపీ ప్రభుత్వం రాగానే రెట్టింపు దండన ఉంటుంది’’ అని తీవ్రంగా హెచ్చరించారు.

Updated Date - 2023-09-23T15:37:00+05:30 IST