Anuradha: చెల్లెళ్లను రోడ్లపాలు చేసిన జగన్‌రెడ్డి.. మహిళా బిల్లు గురించి మాట్లాడటమా..?

ABN , First Publish Date - 2023-09-25T17:27:46+05:30 IST

మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం తెలుగుదేశం పార్టీనేనని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు పంచుమర్తి అనురాధ(Panchumurti Anuradha) వ్యాఖ్యానించారు.

Anuradha: చెల్లెళ్లను రోడ్లపాలు చేసిన జగన్‌రెడ్డి.. మహిళా బిల్లు గురించి మాట్లాడటమా..?

అమరావతి: మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం తెలుగుదేశం పార్టీనేనని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు పంచుమర్తి అనురాధ(Panchumurti Anuradha) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘‘1996లోనే మహిళా బిల్లుకు ఆమోదం తెలుపుతూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు చంద్రబాబు డ్వాక్రా సంఘాలను స్థాపిస్తే.. పొదుపు మహిళల అభయహస్తం నిధులను దోచుకున్న చరిత్ర జగన్‌రెడ్డిది(cm jagan). ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిహక్కు కల్పిస్తే అదే ఆస్తి పంచాల్సి వస్తుందని చెల్లిని గెంటేసిన చరిత్ర జగన్‌రెడ్డిది. తల్లిని గెంటి, చెల్లెళ్లను రోడ్లపాలు చేసిన జగన్‌రెడ్డిదికి మహిళా బిల్లు గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది?. దీపం పథకం ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రన్నను జైలు పాల్జేసిన జగన్‌రెడ్డికి మహిళల గురించి మాట్లాడేహక్కు ఎక్కడిది?. అబ్దుల్ సలామ్ భార్య రహేజా భర్త, పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుందంటే నువ్వు కారణం కాదా జగన్ రెడ్డీ?’’ అని పంచుమర్తి అనురాధ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-25T17:27:46+05:30 IST