Share News

Nara Lokesh: జగన్‌కు ఆత్మలతో మాట్లాడే శక్తి ఉంది

ABN , First Publish Date - 2023-11-29T13:33:28+05:30 IST

జగన్‌కు ఆత్మలతో మాట్లాడే శక్తి ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ( Nara Lokesh ) సెటైర్లు వేశారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ మాట్లాడుతూ... బాంబులకే భయపడని వాళ్లం..కోర్టులు, కేసులకు భయపడతామా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌ చేతులు కలపకుండా కొన్ని శక్తులు విశ్వప్రయత్నం చేశాయన్నారు. తెలుగుదేశం ( Telugu desham ), జనసేన ( Jana sena ) పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని నారా లోకేష్ స్పష్టం చేశారు.

Nara Lokesh: జగన్‌కు ఆత్మలతో మాట్లాడే శక్తి ఉంది

అమరావతి: జగన్‌కు ఆత్మలతో మాట్లాడే శక్తి ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ( Nara Lokesh ) సెటైర్లు వేశారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో లోకేష్ మాట్లాడుతూ... బాంబులకే భయపడని వాళ్లం..కోర్టులు, కేసులకు భయపడతామా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ చేతులు కలవకుండా కొన్ని శక్తులు విశ్వప్రయత్నం చేశాయన్నారు. తెలుగుదేశం ( Telugu desham ), జనసేన ( Jana sena ) పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని స్పష్టం చేశారు. మూడు నెలలు ఓపికగా ఉండండి.. మన ప్రభుత్వం రాబోతుందని స్పష్టం చేశారు. విషపూరితమైన మందును ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అమ్ముతూ డబ్బులు దోచుకుంటున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ మందును అమ్ముతున్న పాపం జగన్‌రెడ్డిని ఊరికే వదిలిపెట్టదని హెచ్చరించారు.

ఏపీలో నిశబ్ధ యుద్ధం జరగబోతుందని చెప్పారు. చరిత్రలోనే 100 సంక్షేమ పథకాలను కట్‌ చేసిన ఏకైక వ్యక్తి జగన్‌‌రెడ్డి అని దెప్పిపొడిశారు. ఛార్జీలను అడ్డగోలుగా పెంచుతూ ఏపీలో జగన్‌రెడ్డి బాదుడే బాదుడుతో ముందుకెళ్తున్నారని అన్నారు. మాట ఇచ్చి మడమ తప్పిన వ్యక్తి ఈ సైకో జగన్‌ అని చెప్పారు. అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని ప్రకటించారు. దళితులకు రావాల్సిన 27 సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 100రోజుల్లో 27 దళిత సంక్షేమ పథకాలను మళ్లీ తీసుకువస్తామని వెల్లడించారు. జీపీఎస్‌ విధానాన్ని తీసుకువచ్చి ఉద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు వేస్తామని నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2023-11-29T13:44:50+05:30 IST