Share News

Nadendla Manohar: పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2023-11-20T23:48:41+05:30 IST

పేదల ఇళ్ల కాలనీల్లో కనీస సదుపాయాలు... మౌలిక వసతులు లేవని వీటిని కల్పించడంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం విఫలం అయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) అన్నారు.

Nadendla Manohar: పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం

అమరావతి : పేదల ఇళ్ల కాలనీల్లో కనీస సదుపాయాలు... మౌలిక వసతులు లేవని వీటిని కల్పించడంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం విఫలం అయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) అన్నారు. సోమవారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘ ‘రుషికొండలో రాజమహల్ నిర్మించుకొంటూ క్లాస్ వార్ అంటారా? పేదవాడికి సెంటు భూమే... ముఖ్యమంత్రి నివాసానికి 9 ఎకరాలు... రూ.451 కోట్లు ఖర్చు అవుతుంది. సీఎం పచ్చదనం చూసేందుకు ప్రహరీ నిర్మించి గడ్డి పెంచడానికి... రూ 21 కోట్లు నిధులయ్యాయి.ఇప్పుడు చెప్పండి ఎవరు పెత్తందారు? ప్రపంచంలో ఏ ప్రభుత్వ అధినేతా ఈ విధంగా వ్యవహరించలేదు? రుషికొండపై టూరిజం ప్రాజెక్ట్ అంటూ బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చారు. గౌరవ న్యాయస్థానాల అఫిడవిట్లలోనూ అదే చెప్పారు. అటు బ్యాంకులను మోసం చేస్తూ... కోర్టులకు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారు. దమ్ముంటే రుషికొండపై నిర్మించేది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమని చెప్పాలి’’ అని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-11-20T23:48:42+05:30 IST