TDP MLA: విద్యార్థి అమర్నాథ్ కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే అనగాని

ABN , First Publish Date - 2023-06-17T09:52:53+05:30 IST

వైసీపీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన విద్యార్థి ఉప్పాల అమర్నాథ్ కుటుంబసభ్యులను టీడీపీ నేతలు పరామర్శించారు. శనివారం ఉదయం రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్.. చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెం చేరుకుని విద్యార్థి కుటుంబసభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేపల్లె చరిత్ర ఎన్నడూ లేని సంఘనలు జరుగుతున్నాయన్నారు. అక్కను వేధించడంపై ప్రశ్నించిన తమ్ముడును పెట్రోల్ పోసి తగలబెట్టారని అన్నారు. పోలీసులు నిందుతులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.

TDP MLA: విద్యార్థి అమర్నాథ్ కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే అనగాని

బాపట్ల: వైసీపీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన విద్యార్థి ఉప్పాల అమర్నాథ్ కుటుంబసభ్యులను టీడీపీ నేతలు (TDP Leaders) పరామర్శించారు. శనివారం ఉదయం రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (Repalle MLA Anagani satyaprasad), టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాస్.. చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెం చేరుకుని విద్యార్థి కుటుంబసభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేపల్లె చరిత్ర ఎన్నడూ లేని సంఘనలు జరుగుతున్నాయన్నారు. అక్కను వేధించడంపై ప్రశ్నించిన తమ్ముడును పెట్రోల్ పోసి తగలబెట్టారని అన్నారు. పోలీసులు నిందుతులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. రేపల్లెలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా వాడుతున్నారని... గతంలో రేపల్లె రైల్వే స్టేషన్‌లో గర్భిణిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నేతలు నేరగాళ్ళను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. అమర్నాధ్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ భరోసా ఇచ్చారు.

అంతకుముందు విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్యేను భట్టిప్రోలు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులు అడ్డుతప్పుకోవడంతో అనగాని సత్యప్రసాద్‌‌ ఉపాలవారిపాలెంకు చేరుకున్నారు.

కాగా... నిన్న (శుక్రవారం) విద్యార్థి అమర్నాథ్‌ను పాము వెంకటేశ్వర రెడ్డి, మరో ముగ్గురు యువకులు కలిసి దారుణంగా హత్య చేశారు. ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. విద్యార్థి హాహాకారాలతో స్థానికులు అక్కడకు చేరుకుని మంటలు ఆర్పి వేసి విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన విద్యార్థి మృతి చెందాడు. తన అక్కను వేధించడంపై ప్రశ్నించినందుకు అమర్నాథ్‌ను నిందితులు ఇంత దారుణంగా హత్య చేశారు. తనను ప్రశ్నించడంపై ఆగ్రహంతో స్నేహితులతో కలసి పాము వెంకటేశ్వర రెడ్డి... అమర్నాథ్‌ను పెట్రోలు పోసి తగలబెట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కన్నబిడ్డ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పోలీస్ పికెట్ ఏర్పాటు

మరోవైపు చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. హత్యకు గురైన విద్యార్థి అమర్నాథ్ మృతదేహానికి ఈరోజు (శనివారం) అంత్యక్రియలు జరుగనున్నాయి. చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెం వెళ్లాలని గౌడ సంఘాలు నిర్ణయించాయి. పరిహారం ప్రకటించకుండా అంత్యక్రియలు చేస్తే ఆందోళనకు దిగే యోచనలో బీసీ సంఘాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-06-17T09:55:03+05:30 IST