Share News

AP High Court: ఏపీ హైకోర్టుని ఆశ్రయించిన కొల్లు రవీంద్ర సతీమణి

ABN , First Publish Date - 2023-10-17T21:32:09+05:30 IST

మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర సతీమణి నీలిమ ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేశారు.

AP High Court:  ఏపీ హైకోర్టుని ఆశ్రయించిన కొల్లు రవీంద్ర సతీమణి

అమరావతి: మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర సతీమణి నీలిమ ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేశారు.తన భర్తను సోమవారం ఉదయం అదుపులోకి తీసుకొని రాత్రి 11.30 గంటలకి ఇంటి వద్ద వదిలి వెళ్లారని నీలిమ పిటీషన్‌లో పేర్కొంది. అకారణంగా తన భర్తని నిర్బంధించి రోజంతా పలు పోలీస్ స్టేషన్లకు తిప్పారని పిటీషన్‌లో తెలిపింది. సహేతుకమైన కారణాలు లేకుండా నిర్బంధించారని ఆందోళన వ్యక్తం చేసింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా తన కార్యకలాపాలు సజావుగా నిర్వహించుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్‌లో కోరారు. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, కృష్ణా SP, బందర్ డీఎస్పీ, అక్కడి సీఐలను పిటీషన్‌లో ప్రతివాధులుగా కొల్లు రవీంద్ర సతీమణి నీలిమ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-17T21:33:17+05:30 IST