AP NEWS: పల్నాటి ఉత్సవాల్లో వృద్ధుడిపై దాడి చేసిన కారంపూడి ఎస్ఐ
ABN , Publish Date - Dec 18 , 2023 | 10:34 PM
పల్నాటి ఉత్సవాలల్లో కారంపూడి ఎస్ఐ రామాంజనేయలు ఓ వృద్ధుడిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. బతుకు దెరువు కోసం వచ్చిన 70 ఏళ్ల వృద్ధుడిపై ఎస్ఐ దాడి చేశారు. వృద్ధుడిని ఎస్ఐ కాలితో పొట్టలో తన్నారు. దీంతో వృద్ధుడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు.
పల్నాడు జిల్లా: పల్నాటి ఉత్సవాలల్లో కారంపూడి ఎస్ఐ రామాంజనేయలు ఓ వృద్ధుడిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. బతుకు దెరువు కోసం వచ్చిన 70 ఏళ్ల వృద్ధుడిపై ఎస్ఐ దాడి చేశారు. వృద్ధుడిని ఎస్ఐ కాలితో పొట్టలో తన్నారు. దీంతో వృద్ధుడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. తిరునాళ్లలో వృద్ధుడు రంగులరాట్నం పెట్టుకున్నారు. ఉచితంగా రంగులరాట్నం తిప్పమని ఎస్ఐ బంధువులు కోరారు. తిప్పలేమని వృద్ధుడు చెప్పడంతో కోపంతో ఉన్న ఎస్ఐ రామాంజనేయలు తీవ్రంగా దాడి చేశాడు. ఎస్ఐ వృద్ధుడిపై దాడి చేయడంతో స్థానికులు తిరగబడ్డారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.