Share News

Sandhyarani : ఏపీకి జగన్ చేసింది శూన్యం

ABN , First Publish Date - 2023-10-22T18:07:20+05:30 IST

ఏపీ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసింది శూన్యమని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ( Gummadi Sandhyarani ) అన్నారు.

Sandhyarani : ఏపీకి జగన్ చేసింది శూన్యం

అమరావతి: ఏపీ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసింది శూన్యమని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ( Gummadi Sandhyarani ) అన్నారు. ఆదివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ..‘‘తండ్రి ముఖ్యమంత్రి కాకముందు ఉండటానికి ఇల్లులేని జగన్‌రెడ్డి.. నేడు నగరానికో రాజభవనం నిర్మించుకుంటున్నాడు. నలుగురు సభ్యులు ఉన్న పేదకుటుంబం ఉండటానికి సెంటుస్థలం ఎలా సరిపోతుంది. నువ్వు.. నీ భార్య ఉండటానికి మాత్రం భారీ రాజభవనాలు కావాలా.. ఇదేం న్యాయం జగన్ రెడ్డి? నా అక్కచెల్లెమ్మలు అని దీర్ఘాలు తీయడం మానేసి వాళ్లకోసం ఇంటికో రూ.20 లక్షలు ఇవ్వలేవా జగన్ రెడ్డి? రూ.25లక్షలతో బాత్రూమ్ నిర్మించుకుంటున్న పేదవాడిని ఈ రాష్ట్రంలోనే చూస్తున్నాం. విశాఖపట్నానికి రమ్మని ముఖ్యమంత్రిని ఎవరు అడిగారు? ఇప్పటికే విశాఖవాసులు..ఉత్తరాంధ్ర ప్రజలు విజయసాయిరెడ్డి..వైసీపీ నేతల దోపిడీ, దారుణాలతో భయం గుప్పిట్లో బతుకులు వెళ్లదీస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా 150 స్థానాలు వచ్చాయని విర్రవీగడంతప్ప.. రాష్ట్రానికి, ప్రజలకు జగన్ ఏమైనా చేశారా’’ అని సంధ్యారాణి ప్రశ్నించారు.

Updated Date - 2023-10-22T18:07:20+05:30 IST