AP Employees: 10వ తేదీ వచ్చినా జీతాలు ఇంకా పడలే.. ఏపీ ఉద్యోగుల ఆందోళన

ABN , First Publish Date - 2023-10-10T16:34:52+05:30 IST

అక్టోబర్‌ 10వ తేదీ వచ్చినా ఇంకా జీతాలు(Salaries) పడలేదని ఏపీ ఉద్యోగులు(AP Employees) ఆందోళన చేస్తున్నారు. ఈ నెలలో 10వ తేదీ వచ్చిన పూర్తి స్థాయిలో పెన్షన్లు, జీతాలు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

AP Employees: 10వ తేదీ వచ్చినా జీతాలు ఇంకా పడలే.. ఏపీ ఉద్యోగుల ఆందోళన

అమరావతి: అక్టోబర్‌ 10వ తేదీ వచ్చినా ఇంకా జీతాలు(Salaries) పడలేదని ఏపీ ఉద్యోగులు(AP Employees) ఆందోళన చేస్తున్నారు. ఈ నెలలో 10వ తేదీ వచ్చిన పూర్తి స్థాయిలో పెన్షన్లు, జీతాలు పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పు కోసం జగన్ సర్కార్ వేటలో ఉంది. 450 కోట్లు అప్పు తెచ్చినా ఖజానాకు ఇంకా నగదు రాలేదు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ వద్ద ఓడీ , వేస్ అండ్ మీన్స్ కింద 5 వేల కోట్లు అప్పుజేసింది. కేంద్రం అదనపు అప్పులు ఇచ్చినా దానికిందే జమ అయింది. దీంతో జీతాలు, పెన్షన్ల కోసం ఏపీ ప్రభుత్వం దీర్ఘాలోచనలు చేస్తోంది. ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు కోసం ప్రతి నెల 5 వేల 500 కోట్లను ఏపీ ప్రభుత్వం వెచ్చిస్తోంది. నేటివరకూ మూడు వేల 500 కోట్లు మాత్రమే జగన్ సర్కార్ జమ చేసింది. దీంతో చాలామంది పెన్షనర్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు పడలేదు. పెన్షనర్లు నగదు రాక వృద్ధాప్యంలో అల్లాడిపోతున్నారు.

Updated Date - 2023-10-10T16:35:37+05:30 IST