AP GOVT VS COG: జగన్ సర్కారుపై కాగ్ మండిపాటు
ABN , First Publish Date - 2023-09-25T18:22:23+05:30 IST
వైసీపీ ప్రభుత్వం(YCP Govt), ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN)పై కాగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన నివేదికపై మండిపడింది. వైసీపీ ప్రభుత్వ విధానాలను కాగ్(Cog) తప్పుబట్టింది.

అమరావతి: వైసీపీ ప్రభుత్వం(YCP Govt), ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN)పై కాగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన నివేదికపై మండిపడింది. వైసీపీ ప్రభుత్వ విధానాలను కాగ్(Cog) తప్పుబట్టింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ నివేదికలను కాగ్ సమర్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు చట్టవిరుద్ధమన్న కాగ్ పేర్కొంది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటును తప్పుబట్టింది. వార్డు కమిటీలను ఏర్పాటు చేయకుండా వికేంద్రీకరణ పాలన కోసం.. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిందని నివేదికలో కాగ్ పేర్కొంది. 2019 జులైలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ.. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిందని కాగ్ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేయడం.. స్థానిక స్వపరిపాలనను దెబ్బతీయడమేనని కాగ్ మందలించింది. స్వపరిపాలన సాధించేందుకు ప్రజాప్రతినిధులతో కూడిన.. వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని కాగ్ సూచించింది.
కాగా.. అసెంబ్లీలో కాగ్ నివేదికను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2016-2021 మధ్య కాలానికి కాగ్ నివేదిక సమర్పించింది. 2015-20 మధ్య కాలంలో..ఏపీకి రావాల్సిన కేంద్ర గ్రాంట్లలో రూ.129 కోట్ల తగ్గుదల చూపించింది. 2016-18 మధ్య కాలంలో పనితీరు గ్రాంటులో రూ.28.93 కోట్లకు కోత విధించింది. తాడిపత్రి, శ్రీకాళహస్తి, పుంగనూరు, అద్దంకి మున్సిపాలిటీలను.. వాటి అర్హతకు తగినట్లు పెంచలేదని కాగ్ గుర్తించింది.