CM Jagan: న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
ABN , Publish Date - Dec 31 , 2023 | 06:31 PM
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ( CM Jagan ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
అమరావతి: నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ( CM Jagan ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కృషి చేస్తున్న ప్రభుత్వం తమదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ 2024లో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని సీఎం జగన్ తెలిపారు.