TDP: భవిష్యత్తు ప్రణాళికపై టీడీపీ ముఖ్యనేతలతో బాలకృష్ణ చర్చలు

ABN , First Publish Date - 2023-09-11T20:09:28+05:30 IST

చంద్రబాబు అరెస్ట్‌‌(Chandrababu Arrested)కు నిరసనగా ఏపీలో టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చింది. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై నేతలతో హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సమాలోచనలు చేశారు.

TDP: భవిష్యత్తు ప్రణాళికపై టీడీపీ ముఖ్యనేతలతో బాలకృష్ణ చర్చలు

అమరావతి: చంద్రబాబు అరెస్ట్‌‌(Chandrababu Arrested)కు నిరసనగా ఏపీలో టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చింది. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై నేతలతో హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సమాలోచనలు చేశారు. సోమవారం నాడు తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి బాలకృష్ణ వచ్చారు. మీడియా రూమ్‌లోకి వచ్చి సీనియర్ నేత యనమల ఇతర నేతలతో కొద్దిసేపు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. చంద్రబాబు అరెస్ట్‌కు ఏపీ అంతటా టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తారు. ఈ ఆందోళనలపై కూడా చర్చించారు. నియంతలా వ్యవహరిస్తున్న సీఎం జగన్‌రెడ్డిని ఎలా అడ్డుకోవాలి. వైసీపీ ప్రభుత్వ పోకడులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ నేతలను పలకరించి రాష్ట్రంలో ఈరోజు చేపట్టిన బంద్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం రెండవ అంతస్తు లోని మిని కాన్ఫరెన్స్ హల్ టీడీపీలో నేతలతో చర్చలు జరిపారు.

Updated Date - 2023-09-11T20:09:28+05:30 IST