Share News

Atchannaidu: సుప్రీంకోర్టు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్న నీలి మీడియా

ABN , First Publish Date - 2023-11-28T18:14:45+05:30 IST

సుప్రీంకోర్టు ( Supreme Court ) వ్యాఖ్యలను నీలి మీడియా వక్రీకరిస్తోందని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ( Atchannaidu ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్న సీఐడీ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించిందని అచ్చెన్నాయుడు చెప్పారు.

Atchannaidu:  సుప్రీంకోర్టు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్న నీలి మీడియా

అమరావతి: సుప్రీంకోర్టు ( Supreme Court ) వ్యాఖ్యలను నీలి మీడియా వక్రీకరిస్తోందని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ( Atchannaidu ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలన్న సీఐడీ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించిందని చెప్పారు. బెయిల్‌ రద్దుపై వెంటనే విచారణ చేపట్టాలన్న సీఐడి వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించిందన్నారు. చంద్రబాబు రాజకీయ కార్యకలాపాలు, ప్రజా కార్యక్రమాలపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు పబ్లిక్‌ మీటింగ్స్‌లో పాల్గొనరాదని సుప్రీంకోర్టు చెప్పినట్టు నీలి మీడియా సాక్షిలో అబద్ధపు స్క్రోలింగ్స్‌ ఇచ్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి 99% మేనిఫెస్టో హామీలు అమలు, లక్షల కోట్ల కుంభకోణాలు చేయకుండా ఉండి ఉంటే చంద్రబాబు ప్రజా పర్యటనలను అడ్డుకోవాల్సిన అవసరం లేదు కదా అని ప్రశ్నించారు. తన ప్రజా వ్యతిరేక విధానాలు, లక్షల కోట్ల లూటీని కప్పిపెట్టుకోవడానికే జగన్‌రెడ్డి వ్యవస్థలను మేనేజ్‌ చేసి సీఐడీతో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. దొంగే దొంగ దొంగ అని అబద్ధపు ప్రచారాలు నీలి మీడియా ద్వారా చేస్తున్నారని చెప్పారు. జగన్‌రెడ్డి తన అవలక్షణాల్ని ఎదుటి వారికి అంటకట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం జగన్‌ నైజమని అచ్చెన్నాయుడు ఎద్దేవ చేశారు.

Updated Date - 2023-11-28T18:14:46+05:30 IST