Dwarampudi: చంద్రబాబు పెదనాన్న, లోకేష్ తమ్ముడు అనుమతి తీసుకుని పవన్ నాపై పోటీ చెయ్..

ABN , First Publish Date - 2023-06-22T14:22:44+05:30 IST

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. చంద్రబాబు పెదనాన్న, లోకేష్ తమ్ముడు అనుమతి తీసుకుని పవన్ కళ్యాణ్ కాకినాడ‌లో తనపై పోటీ చేయాలని వ్యాఖ్యలు చేశారు. నారావారి వాహనంలో ద్వారంపూడి జపం చేస్తున్నారన్నారు.

Dwarampudi: చంద్రబాబు పెదనాన్న, లోకేష్ తమ్ముడు అనుమతి తీసుకుని పవన్ నాపై పోటీ చెయ్..

కాకినాడ: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై (Janasena Chief Pawan Kalyan) కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి (Kakinada MLA Chandrashekar Reddy) విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. చంద్రబాబు (TDP Chief Chandrababu naidu)పెదనాన్న, లోకేష్ (Nara lokesh) తమ్ముడు అనుమతి తీసుకుని పవన్ కళ్యాణ్ కాకినాడ‌లో తనపై పోటీ చేయాలని వ్యాఖ్యలు చేశారు. నారావారి వాహనంలో ద్వారంపూడి జపం చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్‌కు స్క్రిప్ట్ టీడీపీ (TDP) ఆఫీస్ నుంచి వస్తుందని అన్నారు. పవన్ తనపైన లేని పోనీ నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగతంగా ఉంటే మనం మనం చూసుకుందామన్నారు. పవన్ తన వ్యాఖ్యలతో కాకినాడకి చెడ్డ పేరు తీసుకు వస్తున్నారని... జ్ఞానంతో మాట్లాడాలని హితవుపలికారు. బెస్ట్ లివింగ్ సిటీ ఆఫ్ ఇండియాగా కాకినాడ నాలుగవ స్థానంలో ఉందన్నారు. పండించిన పంట తమకు ఇవ్వడానికి రైతులు అమాయకులా అని ప్రశ్నించారు. ఇరవై ఏళ్ళుగా తమ కుటుంబం రైస్ బిజినెస్‌లో లేమని.. ఎగుమతులు మాత్రం చేస్తున్నామని చెప్పారు. అవగాహన లేకుండా మాట్లాడవద్దన్నారు. కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతి అవుతున్న రైస్‌లో 90 శాతం బయట రాష్ట్రాలు నుంచి వస్తుందని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-06-22T14:23:29+05:30 IST