Share News

CBN Health: 3గంటలకు బాబుతో ఫ్యామిలీ ములాఖత్.. హెల్త్‌పై వీడనున్న ఉత్కంఠ

ABN , First Publish Date - 2023-10-14T14:33:33+05:30 IST

మధ్యాహ్నం 3 గంటలకుచంద్రబాబుతో నారా లోకేష్, భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ కానున్నారు. ములాఖత్ తర్వాత చంద్రబాబు ఆరోగ్యంపై

CBN Health: 3గంటలకు బాబుతో ఫ్యామిలీ ములాఖత్.. హెల్త్‌పై వీడనున్న ఉత్కంఠ

రాజమండ్రి: టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై (CBN Health) తెలుగు దేశం శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 5 కిలోల బరువు తగ్గారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హస్తినలో ఉన్న నారా లోకేశ్ హుటాహుటిన రాజమండ్రికి చేరుకున్నారు. మరికాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబుతో నారా లోకేష్, భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ కానున్నారు. ములాఖత్ తర్వాత చంద్రబాబు ఆరోగ్యంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

చంద్రబాబుతో ములాఖత్ తర్వాత కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడనున్నారు. ఆరోగ్య విషయాలను మీడియాకు తెలియజేయనున్నారు.

Updated Date - 2023-10-14T14:43:12+05:30 IST