Chinarajappa: చంద్రబాబుకు బెయిల్ రాకుండా జగన్ అడ్డుకుంటున్నారు

ABN , First Publish Date - 2023-09-26T22:00:08+05:30 IST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)కు బెయిల్ రాకుండా సీఎం జగన్‌రెడ్డి( CM Jagan Reddy) అడ్డుకుంటున్నారని ఆ పార్టీ సీనియర్ నేత చినరాజప్ప(Chinarajappa) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chinarajappa: చంద్రబాబుకు బెయిల్ రాకుండా జగన్ అడ్డుకుంటున్నారు

రాజమండ్రి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)కు బెయిల్ రాకుండా సీఎం జగన్‌రెడ్డి(
CM Jagan Reddy) అడ్డుకుంటున్నారని ఆ పార్టీ సీనియర్ నేత చినరాజప్ప(Chinarajappa) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ యువగళం పాదయాత్రకు లోకేశ్‌ సిద్ధమవుతున్నారనే.. ఈ కేసులో లోకేశ్‌ను 14వ ముద్దాయిగా పెట్టారు. కావాలనే జగన్ ఈ తతంగం మొత్తం నడిపిస్తున్నారు. ఎన్నికల్లో ఎదుర్కోలేక ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. రేపు సీతానగరంలో టీడీపీ నిరసన దీక్షలో నారా భువనేశ్వరి పాల్గొంటారు’’ అని చినరాజప్ప పేర్కొన్నారు.

Updated Date - 2023-09-26T22:00:08+05:30 IST