గల్లా జయదేవ్ పోటీకీ ‘నో’ చెప్పటానికి కారణం ఇదే.. మాజీ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-03T16:57:03+05:30 IST

వైసీపీ (YCP) ప్రభుత్వ బెదిరింపులే ఎంపీ గల్లా జయదేవ్ (Jayadev Galla) వచ్చే ఎన్నికలలో దూరంగా ఉంటానని అనడానికి కారణమని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ (Pithani Satyanarayana) ఆరోపించారు.

గల్లా జయదేవ్ పోటీకీ ‘నో’ చెప్పటానికి కారణం ఇదే.. మాజీ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు

తూర్పుగోదావరి: వైసీపీ (YCP) ప్రభుత్వ బెదిరింపులే ఎంపీ గల్లా జయదేవ్ (Jayadev Galla) వచ్చే ఎన్నికలలో దూరంగా ఉంటానని అనడానికి కారణమని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ (Pithani Satyanarayana) ఆరోపించారు. కార్పోరేట్ సంస్థ ప్రతినిధి కావడంతో జయదేవ్‌ను బెదిరిస్తున్నారని అన్నారు. ఇదే రౌడీయిజం కొనసాగితే పరిశ్రమలే కాదు రాజకీయ నాయకులు దూరమయ్యే ప్రమాదముందని సూచించారు. రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉంటే నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు సస్పండ్ చేశారు? చేశారని ఆయన ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఉన్న 23 ఎమ్మెల్యేల ఓట్లు తమకే వచ్చాయన్నారు. ఎటువంటి నోటిసులు ఇవ్వకుండా సస్పెండ్ ఏలా చేస్తారు? అని ప్రశ్నించారు. నాలుగు గోడల మధ్య ఎమ్మెల్యేలను బెదిరించి పబ్బం గడపాలని చూస్తే దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు కొనసాగించే ఆలోచనలో ఉందన్నారు. టీడీపీ (TDP) మ్యానిఫెస్టో కమిటీ సంక్షేమ పథకాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి ధర్మాన ప్రసాద్ వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని చేస్తున్న వ్యాఖ్యలు నిజం కాదన్నారు. తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో వైసీపీ శాసిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. కలిసి వచ్చే పార్టీలతో వచ్చే ఎన్నికలలో పొత్తు పెట్టుకుంటామన్నారు.

Updated Date - 2023-04-03T16:57:05+05:30 IST