Nara Lokesh: ఓ చేత్తో పది ఇచ్చి.. మరో చేత్తో వంద కొట్టేస్తున్నారు

ABN , First Publish Date - 2023-01-28T15:12:58+05:30 IST

మూడు వేల కోట్లతో ప్రత్యేక నిధి పెట్టి గిట్టుబాటు ధర కల్పిస్తామన్న జగన్ రెడ్డి (Jagan) ఎక్కడ? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు.

Nara Lokesh: ఓ చేత్తో పది ఇచ్చి.. మరో చేత్తో వంద కొట్టేస్తున్నారు
అవినీతి సొమ్ము కోసమే

కుప్పం: మూడు వేల కోట్లతో ప్రత్యేక నిధి పెట్టి గిట్టుబాటు ధర కల్పిస్తామన్న జగన్ రెడ్డి (Jagan) ఎక్కడ? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర (Lokesh Yuvagalam Padayatra) రెండో రోజు కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా గణేష్‌పురం క్రాస్‌లో మహిళలు, స్థానిక రైతులతో నారా లోకేష్ మాట్లాడారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి బతుకు భారం అవుతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మోటార్లకు మీటర్లు బలవంతంగా పెడుతున్నారు అంటూ తమ బాధను రైతులు చెప్పుకున్నారు.

అలాగే కడపల్లిలో పొలంలో పని చేసుకుంటున్న రైతు దంపతులు రాజమ్మ, ముని రత్నంను యువనేత కలిశారు. మొక్క జొన్న, టమాటో పంటలు వేసి నష్ట పోయాం అంటూ రాజమ్మ, ముని రత్నం ఆవేదన చెందారు. పెట్టుబడి పెరిగిపోతుంది, పండిన పంటకు కనీస ధర రాక ఇబ్బంది పడుతున్నామని.. అర ఎకరంలో వ్యవసాయం చేస్తున్నాం అంటూ వ్యవసాయంలో ఉన్న కష్టాలు లోకేష్‌కి రైతులు వివరించారు.

లోకేష్ కామెంట్స్..

‘‘విపరీతంగా పన్నులు పెంచేశారు. ధరలన్నీ పెంచేశారు. సామాన్యులు బ్రతికే పరిస్థితి రాష్ట్రంలో లేదు. కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయిలు కొట్టేస్తున్నారు. రైతుల మెడలో మీటర్లు ఉరి తాళ్లగా మారబోతున్నాయి. మీటర్ల కొనుగోలులో భారీ స్కాం జరిగింది. అవినీతి సొమ్ము కోసమే రైతుల మెడలో మీటర్లు. వ్యవసాయం చేసే రైతుకి సాయం అందడం లేదు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. వైసీపీ ప్రభుత్వ (Ycp government) విధానాల వల్ల రైతులు క్రాప్ హాలిడే ఇచ్చే దుస్థితి వచ్చింది.’’ అంటూ ప్రభుత్వంపై నారా లోకేష్ మండిపడ్డారు.

Updated Date - 2023-01-28T15:13:02+05:30 IST