Lokesh Padayatra: భయం నా బయోడేటాలో లేదు.. ఏం పీకుతారో పీక్కొండి

ABN , First Publish Date - 2023-01-28T12:49:44+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది.

Lokesh Padayatra: భయం నా బయోడేటాలో లేదు.. ఏం పీకుతారో పీక్కొండి

కుప్పం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర (Lokesh Yuvagalam Padayatra) రోజు కొనసాగుతోంది. పీఈస్ మెడికల్ కాలేజీ సమీపంలో నిర్మాణంలో ఆగిపోయిన వాల్మీకి, కురుబ కమ్యూనిటీ హాల్స్‌ను లోకేష్ పరిశీలించారు. టీడీపీ హయాంలో రూ.10 కోట్లతో నిర్మించతలపెట్టిన వాల్మీకి, కురుబ కమ్యూనిటీ హాల్స్‌ను వైసీపీ ప్రభుత్వం(YCP government) కక్ష పూరితంగా ఆపేసిందని బీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేశారన్నారు. కమ్యూనిటీ హాల్లో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారని... ఆకతాయిలకు అడ్డాగా మారిపోయాయి అంటూ బీసీలు ఆవేదన చెందారు.

దీనిపై లోకేష్ స్పందిస్తూ... వాల్మీకి, కురుబ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం ఆపేయడం దుర్మార్గమన్నారు. ‘‘మీకు చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu)పై కోపం ఉంటే బీసీలపై చూపించడం ఏంటి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కురబలకు ఒక్క ప్రయోజనం కూడా జరగలేదన్నారు. కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ అందలేదన్నారు. కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం ఆగిపోతే కురుబ కార్పొరేషన్ చైర్మన్ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ అధికారం వచ్చిన వెంటనే మూడు నెలల్లో భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చరిత్రలో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించిన సీఎం ఒక్క జగన్ (AP CM Jaganmohan Reddy) మాత్రమే అని ఆయన అన్నారు.

10 శాతం రిజర్వేషన్లు కట్ చేయడం వలన బీసీలు స్థానిక సంస్థల్లో వేలాదిగా పదవులు కోల్పోయారని తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలు అందరూ మాట్లాడాలని పిలుపునిచ్చారు. పార్టీలో బీసీ సాధికార సమితి ఏర్పాటు చేశామని.. బీసీల ఆర్థిక, రాజకీయ అభివృద్ది కోసం అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. కుప్పంలో ఎప్పుడూ ఇలాంటి రాజకీయాలు జరగలేదన్నారు. కుప్పం లో జరుగుతున్న అరాచకాలకు పెద్దిరెడ్డే కారణమని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే వారికి చక్రవడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ‘‘భయం నా బయోడేటాలో లేదు. మర్డర్ కేసుతో సహా అన్ని కేసులు నాపై పెట్టారు. ఏం పికుతారో పీక్కొండి’’ అంటూ లోకేష్ సవాల్ వేశారు.

Updated Date - 2023-01-28T12:49:45+05:30 IST