TTD: శ్రీవాణి టిక్కెట్ల కరెంటు బుకింగ్‌ పున:ప్రారంభం

ABN , First Publish Date - 2023-02-22T14:49:32+05:30 IST

శ్రీవాణి టిక్కెట్ల కరెంటు బుకింగ్‌ను టీటీడీ పున:ప్రారంభించింది.

TTD: శ్రీవాణి టిక్కెట్ల కరెంటు బుకింగ్‌ పున:ప్రారంభం

తిరుమల: శ్రీవాణి టిక్కెట్ల కరెంటు బుకింగ్‌ (Online booking of Srivani tickets) ను టీటీడీ (TTD) పున:ప్రారంభించింది. తిరుపతి (Tirupati)లో ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తున్న టిక్కెట్లు బ్లాక్ మార్కెటింగ్ అవుతుండడంతో గతేడాది డిసెంబర్ 29 నుంచి కరెంటు బుకింగ్ కౌంటర్‌ను టీటీడీ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే భక్తుల నుంచి వస్తున్న విజ్ఞాపనలు మేరకు తిరిగి తిరుమలలో ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టిక్కెట్లు కేటాయింపుని ప్రారంభించింది. కాగా... టిక్కెట్ల కోటాను టీటీడీ భారీగా కుదించింది. గతంలో నిత్యం రెండున్నర వేల టిక్కెట్లను జారీ చేయగా.. ప్రస్తుతం రోజుకు రూ.150 టిక్కెట్లకు మాత్రమే పరిమితం చేసింది. మార్చి 1 నుంచి రోజూ 400 టిక్కెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఎయిర్‌పోర్టులో ప్రస్తుతం నిత్యం 250 టిక్కెట్లను కేటాయిస్తుండగా.. నేటి నుంచి వాటిని 100 టికెట్లకు మాత్రమే కుదిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2023-02-22T14:49:53+05:30 IST