GopiReddySrinivasReddy: కాల్‌ డేటా తీద్దాం... కాల్పుల ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-02-02T10:43:01+05:30 IST

టీడీపీ నేత బాలకోటిరెడ్డిపై కాల్పులకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలను నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి తీవ్రంగా ఖండించారు.

GopiReddySrinivasReddy: కాల్‌ డేటా తీద్దాం... కాల్పుల ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే

పల్నాడు: టీడీపీ నేత బాలకోటిరెడ్డి (TDP Leader BalakotiReddy)పై కాల్పులకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలను నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి (Narasaraopet MLA GopitReddySrinivasReddy) తీవ్రంగా ఖండించారు. గురువారం ఏబీఎన్‌ (ABN- Andhrajyothy) తో మాట్లాడుతూ... అసత్య ప్రచారాలు చేయవద్దన్నారు. టీడీపీ నేతల (TDP Leaders) మధ్య ఆధిపత్య పోరే హత్యాయత్నానికి కారణమన్నారు. బాలకోటిరెడ్డిపై కాల్పులు (Firing on Balakotireddy) జరిపిన వెంకటేశ్వరరెడ్డి టీడీపీలోనే ఉన్నారని... దాన్ని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ టీడీపీ నేతలకు ఛాలెంజ్ విసిరారు. ‘‘కాల్ డేటా తీద్దాం... ఎవరు ఎవరితో మాట్లాడారో తేలిపోతుంది. తుపాకి ఇచ్చిన వ్యక్తిని, దాడి చేసిన వ్యక్తులందరిని పోలీసులు అరెస్టు చేశారు. గన్ కల్చర్ రావటం దురదృష్టకరం. ఘటనకు బాధ్యులైన వారందరిని అరెస్టు చేయమని పోలీసులకు చెప్పాను. ఎటువంటి విచారణకైనా సిద్ధం’’ అని గోపిరెడ్డి స్పష్టం చేశారు.

ఇంట్లో నిద్రిస్తున్న టీడీపీ నేతను బయటకు పిలిచి మరీ....

నరసరావుపేట నియోజకవర్గం (Narasaraopet Constituency)లో టీడీపీ నేతపై కాల్పులు జరపడం కలకలం రేపింది. రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై వైసీపీ నేతలు (YCP Leaders) కాల్పులు జరిపారు. గత రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న టీడీపీ నేతను బయటకు పిలిచి మరీ పిస్టల్‌తో కాల్చారు. వైసీపీ నేత పమ్మి వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, పూజల రాముడు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పులతో బాలకోటిరెడ్డి కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తీవ్ర గాయపడిన టీడీపీ నేతు హుటాహుటిన నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. టీడీపీ ప్రభుత్వం (TDP Government)లో బాలకోటి రెడ్డి రొంపిచెర్ల ఎంపీపీ (MPP)గా పని చేశారు. బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం జరగడం ఇది రెండో సారి. కొద్ది నెలల క్రితమే ఆయనపై పలువురు వైసీపీ కార్యకర్తలు (YCP Avtivists)కత్తులతో దాడి చేయడంతో గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా స్వగ్రామం అలవాలలో మరోసారి కాల్పులతో హత్యాప్రయత్నం చేశారు. విషయం తెలిసిన వెంటనే టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్ బాబు ఆస్పత్రికి చేరుకుని బాలకోటిరెడ్డి పరామర్శించి దగ్గరుండి వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు.

ఎమ్మెల్యే గోపిరెడ్డిపై ఆరోపణలు....

టీడీపీ నేత బాలకోటిరెడ్డిపై కాల్పులు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (YCP MLA GopiReddySrinivasReddy) కనుసన్నల్లోనే జరిగాయని తెలుగుదేశం నేత చదలవాడ అరవింద్ బాబు (TDP Leader Chadalavada ArvindBabu) ఆరోపించారు. గోపిరెడ్డి నర్సరావుపేటకు గన్ కల్చర్ తీసుకొచ్చారన్నారు. బాలకోటి రెడ్డిపై రెండోసారి హత్యాయత్నం జరిగిందని తెలిపారు. నరసరావుపేట ఎస్పీ ఉన్నప్పటికీ హత్యలు, దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇటీవల ఇబ్రహీం హత్య జరిగిందని... తాజాగా బాలకోటి రెడ్డిపై హత్య ప్రయత్నం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. బాలకోటిరెడ్డి బలమైన టీడీపీ నేత అని తెలిపారు. గతంలో దాడి చేసిన తర్వాత వెంకటేశ్వరెడ్డికి ఎమ్మెల్యే గోపిరెడ్డే ఆశ్రయం ఇచ్చారని... దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు. బాలకోటి రెడ్డిపై దాడి చేసిన వెంకటేశ్వర రెడ్డి, రాముడు, గడ్డం వెంకట్రావులు ఎమ్మెల్యే గోపిరెడ్డి అనుచరులే అని అరవింద్ బాబు ఆరోపించారు.

Updated Date - 2023-02-02T10:43:02+05:30 IST