Nara Lokesh: కుప్పంకు భారీగా తరలివస్తున్న టీడీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2023-01-27T10:56:09+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) 'యువగళం (Yuvagalam)' పాదయాత్ర (Padayatra) శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.

Nara Lokesh: కుప్పంకు భారీగా తరలివస్తున్న టీడీపీ శ్రేణులు

చిత్తూరు జల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) 'యువగళం (Yuvagalam)' పాదయాత్ర (Padayatra) శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆయన ఈ ఉదయం వరదరాజుల ఆలయానికి బయల్దేరి వెళ్లారు. గుడిలో పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభించనున్నారు. దారి పొడవునా లోకేష్‌కు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆయన పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ శ్రేణులు కుప్పంకు భారీగా తరలివస్తున్నారు. పసుపు జెండాలు, టీడీపీ శ్రేణులతో కుప్పం సందడిగా మారింది. అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకూ కుప్పంకు తరలివస్తున్నారు.

శుక్రవారం ఉదయం లోకేష్ 11:03 గంటలకు పాదయాత్రలో తొలి అడుగు వేయనున్నారు. 11:55గంటలకు హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. మధ్యాహ్నం 12:45కు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. 1:05కు కుప్పం బస్టాండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు., 1:25కు కొత్త బస్టాండ్ దగ్గర పొట్టి శ్రీరాములు, గాంధీ విగ్రహాలకు నివాళులు ఆర్పించనున్నారు. సాయంత్రం 3 గంటలకు యువగళం సభకు హాజరుకానున్నారు.

సభ అనంతరం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి, శెట్టిపల్లె క్రాస్ రోడ్డు, బెగ్గిలిపల్లె క్రాస్ మీదుగా రాత్రి బస ప్రాంతానికి చేరుకోనున్నారు. తొలిరోజు లోకేష్ పాదయాత్ర 8.5 కిలోమీటర్ల దూరం కొనసాగనుంది.

Updated Date - 2023-01-27T17:33:00+05:30 IST